ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్రెంచ్‌మ్యాన్‌ లా ఆదరించారు

ABN, Publish Date - May 26 , 2025 | 05:04 AM

దాదాపు రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన ఆటతో అభిమానులను ఉర్రూతలూగించి, గతేడాదే టెన్ని్‌సకు వీడ్కోలు పలికిన రఫెల్‌ నడాల్‌కు తనకు అచ్చొచ్చిన ఎర్రమట్టిలో ఘన సన్మానం జరిగింది. మరెవరికీ..

సన్మాన వేడుకలో నడాల్‌ భావోద్వేగం

పారిస్‌: దాదాపు రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన ఆటతో అభిమానులను ఉర్రూతలూగించి, గతేడాదే టెన్ని్‌సకు వీడ్కోలు పలికిన రఫెల్‌ నడాల్‌కు తనకు అచ్చొచ్చిన ఎర్రమట్టిలో ఘన సన్మానం జరిగింది. మరెవరికీ సాధ్యంకాని రీతిలో, ఏకంగా 14 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ కిరీటాన్ని అందుకున్న ఈ మట్టి వీరుడికి రోలాండ్‌గారోస్‌ నిర్వాహకులు అద్భుతరీతిలో సత్కరించారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ తొలిరోజు పోటీల సందర్భంగా ఆదివారం ‘రఫా..రఫా’ అంటూ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య నడాల్‌ మెయిన్‌ కోర్టులోకి అడుగుపెట్టాడు. అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న రఫా..‘అందరికీ నమస్కారాలు. 20 ఏళ్లపాటు ఈ కోర్టులో ఆడిన నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో కూడా తెలియడం లేదు. నిస్సందేహంగా ఈ వేదిక నాకెంతో ప్రత్యేకమైనది. థాంక్యూ ఫ్రాన్స్‌.. థాంక్యూ పారిస్‌.. నేనెన్నడూ ఊహించలేని మరపురాని క్షణాలు, మధురమైన అనుభూతులు ఇక్కడ నాకు పంచారు. మీ ఫ్రెంచ్‌మ్యాన్‌లా నన్ను ఆదరించారు’ అని అన్నాడు. అనంతరం తన సమకాలీనులైన ఫెడరర్‌, జొకోవిచ్‌, ముర్రేలతో కలిసి నడాల్‌ ఫొటోలకు పోజిచ్చాడు. కార్యక్రమంలో నడాల్‌ తల్లిదండ్రులు, భార్య, రెండేళ్ల కుమారుడు హాజరయ్యారు.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:04 AM