ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముంబై వచ్చేసింది

ABN, Publish Date - May 22 , 2025 | 04:02 AM

సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్‌) మెరుపులతోపాటు శాంట్నర్‌ (3/11) తిప్పేయడంతో.. ముంబై ఇండియన్స్‌ ప్లేఆ్‌ఫ్సకు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో...

నేటి మ్యాచ్‌

గుజరాత్‌ X లఖ్‌నవూ

వేదిక : అహ్మదాబాద్‌, రా.7.30 నుంచి

  • ప్లేఆ్‌ఫ్సకు హార్దిక్‌ సేన

  • విజృంభించిన సూర్యకుమార్‌

  • అదరగొట్టిన శాంట్నర్‌, బుమ్రా

  • ముగిసిన ఢిల్లీ కథ

ముంబై: సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్‌) మెరుపులతోపాటు శాంట్నర్‌ (3/11) తిప్పేయడంతో.. ముంబై ఇండియన్స్‌ ప్లేఆ్‌ఫ్సకు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై 59 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ నాకౌట్‌ రేసు నుంచి అవుటైంది. మరొక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలివున్న ఢిల్లీ ఆ పోటీలో నెగ్గినా 15 పాయింట్లే అవుతాయి. ఇక ఐదుసార్లు టైటిల్‌ గెల్చుకున్న ముంబై ప్లే ఆఫ్స్‌ చేరడం ఇది 11వసారి. గుజరాత్‌, బెంగళూరు, పంజాబ్‌ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్తులను ఖరారుచేసుకున్న సంగతి తెలిసిందే.

తొలుత ముంబై 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది. తిలక్‌ వర్మ (27), నమన్‌ ధిర్‌ (24 నాటౌట్‌), రికెల్టన్‌ (25) రాణించారు. ముకేశ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్‌ రిజ్వీ (39), విప్రజ్‌ (20) టాప్‌ స్కోరర్లు. బుమ్రా 3 వికెట్లు తీశాడు. అనారోగ్యంతో ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ మ్యాచ్‌కు దూరమవడంతో.. డుప్లెసి సారథిగా వ్యవహరించాడు. సూర్య ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


బ్యాటర్లు విఫలం: ఛేదనలో ఢిల్లీ ఘోరంగా తడబడింది. ఓపెనర్లు డుప్లెసి (6), రాహుల్‌ (11) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. అభిషేక్‌ పోరెల్‌ (6)ను జాక్స్‌ అవుట్‌ చేయడంతో ఢిల్లీ 27/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో విప్రజ్‌, సమీర్‌ ఆదుకొనే ప్రయత్నం చేయడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ 49/3తో నిలిచింది. అయితే, 8వ ఓవర్‌లో విప్రజ్‌ను శాంట్నర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపడంతో.. నాలుగో వికెట్‌కు 28 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధాటిగా ఆడగలిగే స్టబ్స్‌ (2)ను బుమ్రా ఎల్బీ చేయడంతో.. 10 ఓవర్లకే ఢిల్లీ సగం వికెట్లు చేజార్చుకొంది. రిజ్వీ, అశుతోష్‌ శర్మ (18) ఆరో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యంతో కొంతసేపు పోరాడారు. అయితే, 15వ ఓవర్‌లో వీరిద్దరినీ శాంట్నర్‌ అవుట్‌ చేయడంతో.. ఢిల్లీ ఓటమి ఖరారైంది. మాధవ్‌ తివారి (3), కుల్దీప్‌ (7), ముస్తాఫిజుర్‌ (0) సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరిగారు.


ఆఖర్లో అదరగొట్టారు: మందకొడి పిచ్‌పై ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా.. డెత్‌ ఓవర్లలో సూర్యకుమార్‌, నమన్‌ ఆరో వికెట్‌కు అజేయంగా 21 బంతుల్లో 57 పరుగులు జోడించడంతో ముంబై సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. రోహిత్‌ శర్మ (5) విఫలమైనా.. మరో ఓపెనర్‌ రికెల్టన్‌, విల్‌ జాక్స్‌ (13 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21) దూకుడుగా ఆడారు. దీంతో పవర్‌ప్లేను ముంబై 54/2తో ముగించింది. మూడు ఫోర్లు, సిక్స్‌తో జోరుమీదున్న జాక్స్‌ను ముకేశ్‌ వెనక్కిపంపడంతో.. రెండో వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక, మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కుల్దీప్‌, విప్రజ్‌ పరుగులను కట్టడి చేయడంతో.. 7-15 ఓవర్ల మధ్య ముంబై 60 పరుగులే చేయగలిగింది. ఏడో ఓవర్‌లో రికెల్టన్‌ను కుల్దీప్‌ అవుట్‌ చేసి షాకిచ్చాడు. ఈ దశలో సూర్య, తిలక్‌ ఆచితూచి ఆడుతూ.. నాలుగో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, కీలక సమయంలో తిలక్‌ను ముకేశ్‌ వెనక్కిపంపగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (3)ను చమీర క్యాచవుట్‌ చేశాడు. కానీ, చివరి రెండు ఓవర్లలో సూర్య, నమన్‌ చెలరేగి 48 పరుగులు పిండుకోవడంతో.. ముంబై స్కోరు 180 పరుగుల మార్క్‌ను అందుకొంది. 19వ ఓవర్‌లో ముకేశ్‌ బౌలింగ్‌లో సూర్య సిక్స్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. 4,6,6,4 బాదిన నమన్‌ ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. చమీర వేసిన ఆఖరి ఓవర్‌లో సూర్య రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.


స్కోరుబోర్డు

ముంబై: రికెల్టన్‌ (సి) తివారి (బి) కుల్దీప్‌ 25, రోహిత్‌ (సి) పోరెల్‌ (బి) ముస్తాఫిజుర్‌ 5, విల్‌ జాక్స్‌ (సి) విప్రజ్‌ (బి) ముకేశ్‌ 21, సూర్యకుమార్‌ (నాటౌట్‌) 73, తిలక్‌ (సి) రిజ్వీ (బి) ముకేశ్‌ 27, హార్దిక్‌ (సి) ముకేశ్‌ (బి) చమీర 3, నమన్‌ ధిర్‌ (నాటౌట్‌) 24, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 180/5; వికెట్ల పతనం: 1-23, 2-48, 3-58, 4-113, 5-123; బౌలింగ్‌: ముకేశ్‌ 4-0-48-2, చమీర 4-0-54-1, ముస్తాఫిజుర్‌ 4-0-30-1, విప్రజ్‌ నిగమ్‌ 4-0-25-0, కుల్దీప్‌ 4-0-22-1.

ఢిల్లీ: రాహుల్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 11, డుప్లెసి (సి) శాంట్నర్‌ (బి) చాహర్‌ 6, పోరెల్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) జాక్స్‌ 6, రిజ్వీ (బి) శాంట్నర్‌ 39, విప్రజ్‌ (సి అండ్‌ బి) శాంట్నర్‌ 20, స్టబ్స్‌ (ఎల్బీ) బుమ్రా 2, అశుతోష్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) శాంట్నర్‌ 18, మాధవ్‌ తివారి (బి) బుమ్రా 3, చమీర (నాటౌట్‌) 8, కుల్దీప్‌ (సి/సబ్‌) బవ (బి) కర్ణ్‌ శర్మ 7, ముస్తాఫిజుర్‌ (బి) బుమ్రా 0, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 18.2 ఓవర్లలో 121 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-12, 2-20, 3-27, 4-55, 5-65, 6-103, 7-104, 8-108, 9-120, 10-121; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-29-1, దీపక్‌ చాహర్‌ 3-0-22-1, విల్‌ జాక్స్‌ 1-0-16-1, శాంట్నర్‌ 4-0-11-3, బుమ్రా 3.2-0-12-3, కర్ణ్‌ శర్మ 3-0-31-1.

1

ఐపీఎల్‌ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా.. ప్లేఆ్‌ఫ్సకు దూరమైన మొదటి జట్టుగా ఢిల్లీ

సూర్యకుమార్‌ (43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 నాటౌట్‌)


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 12 9 3 0 18 0.795

బెంగళూరు 12 8 3 1 17 0.482

పంజాబ్‌ 12 8 3 1 17 0.389

ముంబై 13 8 5 0 16 1.292

ఢిల్లీ 13 6 6 1 13 0.019

కోల్‌కతా 13 5 6 2 12 0.193

లఖ్‌నవూ 12 5 7 0 10 -0.506

హైదరాబాద్‌ 12 4 7 1 9 -1.005

రాజస్థాన్‌ 14 4 10 0 8 -0.549

చెన్నై 13 3 10 0 6 -1.030

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవీ చదవండి:

కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 04:02 AM