పంజాబ్ లక్ష్యం 204
ABN, Publish Date - Jun 02 , 2025 | 03:48 AM
ఐపీఎల్ ఫైనల్లో చోటు కోసం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44)...
చెలరేగిన ముంబై ఇండియన్స్
సూర్య, తిలక్ మెరుపు ఇన్నింగ్స్
ఐపీఎల్ క్వాలిఫయర్-2
అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్లో చోటు కోసం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44), తిలక్ వర్మ (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) వేగం కనబర్చారు. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెయిర్‌స్టో (38), నమన్ ఽధిర్ (37) రాణించారు. ఒమర్జాయ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కడపటి వార్తలందేసరికి పంజాబ్ 15 ఓవర్లలో 3 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 38, ప్రియాన్ష్ ఆర్య 20, ప్రభ్‌సిమ్రన్ 6 పరుగులు చేశారు. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (41), నేహల్ వధేరా (41) ఉన్నారు.
రెండున్నర గంటలు ఆలస్యంగా..
వర్షం కారణంగా ఈ మ్యాచ్ నిర్ణీత సమయంకన్నా రెండున్నర గంటలు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ వేసేటప్పుడు వాతావరణం మెరుగ్గానే ఉన్నా సరిగ్గా మ్యాచ్ సమయానికి వర్షం ఆరంభమైంది. దీంతో ఎలాంటి ఓవర్ల కోత లేకుండా రాత్రి 9.45కి మ్యాచ్ ఆరంభమైంది.
కలిసికట్టుగా..:టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్ మెరుపు వేగంతో సాగింది. ఓపెనర్ రోహిత్ (8) మూడో ఓవర్‌లోనే వెనుదిరిగినా.. బెయిర్‌స్టో-తిలక్ జోడీ ఎదురుదాడికి దిగింది. అటు సూర్యకుమార్.. చివర్లో నమన్ ధిర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోరు అందుకుంది. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన తిలక్ వచ్చీ రావడంతోనే రెండు సిక్సర్లతో చెలరేగాడు. ఆరో ఓవర్‌లో బెయిర్‌స్టో 4,6తో పవర్‌ప్లేలో జట్టు 65/1 స్కోరుతో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే వైశాక్ నకుల్ బాల్‌కు బెయిర్‌స్టో వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత తిలక్‌కు సూర్యకుమార్ జత కట్టడంతో రన్‌రేట్ పది రన్స్‌కు తగ్గకుండా సాగింది. స్పిన్నర్ చాహల్ లక్ష్యంగా సూర్య పదో ఓవర్‌లో 6,4.. 12వ ఓవర్‌లో మరో సిక్సర్‌తో ధాటిని కనబర్చాడు.
అయితే ఎడాపెడా షాట్లతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి చాహల్ చెక్ పెట్టాడు. 14వ ఓవర్‌లో సూర్య 4,6 బాదినా ఐదో బంతికి వెనుదిరిగాడు. అప్పటికే మూడో వికెట్‌కు 72 పరుగులు జత చేరాయి. తర్వాతి ఓవర్‌లోనే తిలక్‌కు పేసర్ జేమిసన్ షాకిచ్చాడు. కాసేపటికే కెప్టెన్ హార్దిక్ (15)ను ఓ బౌన్సర్‌తో పేసర్ ఒమర్జాయ్ అవుట్ చేశాడు. కానీ నమన్ ధిర్ మాత్రం చివర్లో బౌండరీలతో జోరు చూపాడు. ఆఖరి ఓవర్‌లో తను అవుటైనా ముంబై 200 స్కోరు దాటగలిగింది.
1
ఐపీఎల్ సీజన్‌లో ఓపెనర్‌గా ఆడకుండానే ఎక్కువ పరుగులు (717) సాధించిన బ్యాటర్‌గా సూర్యకుమార్.
1
ఐపీఎల్ ప్లేఆ్‌ఫ్సలో ఒక్క ఆటగాడి హాఫ్ సెంచరీ లేకుండానే ఓ జట్టు (ముంబై) 200+ స్కోరు సాధించడం ఇదే తొలిసారి.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 03:48 AM