ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BCCI Review Meeting: మోర్కెల్‌పై వేలాడుతున్న కత్తి

ABN, Publish Date - Jul 28 , 2025 | 02:25 AM

ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో భారత జట్టు బౌలింగ్‌ ప్రదర్శనపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో టీమిండియా సహాయ సిబ్బంది మోర్నీ మోర్కెల్‌, టెన్‌ డష్కాటెపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది...

టీమిండియా బౌలింగ్‌ ప్రదర్శనపై బీసీసీఐ గుర్రు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో భారత జట్టు బౌలింగ్‌ ప్రదర్శనపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో టీమిండియా సహాయ సిబ్బంది మోర్నీ మోర్కెల్‌, టెన్‌ డష్కాటెపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పనితీరుపైనా బోర్డు పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారట. అజిత్‌ ప్రస్తుతం జట్టుతోనే పర్యటిస్తున్నాడు. అయితే, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించకపోవడం బోర్డు ఆగ్రహానికి ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ సిరీ్‌సలో టీమిండియా బౌలింగ్‌ మరీ నాసిరకంగా ఉంది. ఈ నేపథ్యంలో బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌ పనితీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. అసిస్టెంట్‌ కోచ్‌ డష్కాటే కూడా ఆశించినంత జట్టుకు సేవలందించలేక పోయాడు. సిరీస్‌ ముగిసిన తర్వాత సమీక్షా సమావేశంలో వీరిద్దరిపై వేటువేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే, చీఫ్‌ కోచ్‌ గంభీర్‌ పోస్టుకు ఇప్పట్లో గండం లేదని తెలుస్తోంది. వైట్‌బాల్‌ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన గౌతీకి ప్లస్‌గా మారింది.

ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 02:25 AM