Siraj Hyderabad Welcome: సిరాజ్ మియా ఆగయా
ABN, Publish Date - Aug 07 , 2025 | 03:16 AM
భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ విచ్చేశాడు. బుధవారం ఇక్కడకు చేరుకున్న సిరాజ్‌కు విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు సాదర స్వాగతం పలికారు...
స్వస్థలానికి స్టార్ పేసర్‌ఫ అభిమానుల సాదర స్వాగతం
హైదరాబాద్: భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ విచ్చేశాడు. బుధవారం ఇక్కడకు చేరుకున్న సిరాజ్‌కు విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు సాదర స్వాగతం పలికారు. అంతకుముందు ఫీల్డింగ్ కోచ్ దిలీ్‌పతోపాటు సిరాజ్ లండన్ నుంచి తెల్లవారుజామున ముంబైలో దిగాడు. ఎయిర్‌పోర్టులో పలువురు ఫ్యాన్స్ సిరాజ్‌ను ఆటోగ్రా్‌ఫలతోపాటు సెల్ఫీలకోసం అడగడం కనిపించింది. ముంబైలో దిగిన వెంటనే మరో విమానంలో సిరాజ్ హైదరాబాద్ బయలుదేరాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అన్ని (5) టెస్టుల్లోనూ ఆడిన సిరాజ్ మొత్తం 23 వికెట్లు తీసి రెండు జట్లలో టాప్ బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా చివరి టెస్టులో తొమ్మిది వికెట్ల ప్రదర్శనతో జట్టు చిరస్మరణీయ విజయం అందుకోవడంలో 31 ఏళ్ల హైదరాబాదీ కీలక భూమిక పోషించాడు. మరీ ముఖ్యంగా..విజయానికి ఇంగ్లండ్ ఏడు పరుగుల దూరంలో నిలిచి టీమిండియాను ఆందోళనకు గురి చేసిన తరుణంలో ఓ అద్భుత యార్కర్‌తో అట్కిన్సన్‌ను బౌల్డ్ చేసిన సిరాజ్ ఇంగ్లండ్ ఆశలకు తెరదించాడు. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన సిరాజ్..సోదరుడు స్వయంగా నడుపుతుండగా కారులో ఇంటికి వెళ్లిపోయాడు. మరోవైపు సిరాజ్‌ను సన్మానించేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ‘సిరాజ్‌తో ఇంకా మాట్లాడలేదు. అయితే అతడు నగరంలో కొద్ది రోజులు ఉంటున్నందున తప్పకుండా సన్మానిస్తాం’ అని హెచ్‌సీఏ అధికారి ఒకరు తెలిపారు.
కెరీర్ బెస్ట్ ర్యాంక్
ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టును భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్ ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకెళ్లాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్.. బౌలర్ల జాబితాలో సిరాజ్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు. తద్వారా 15వ ర్యాంక్‌తో మొదటిసారి టాప్-15లో నిలిచాడు. సిరాజ్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. గతేడాది జనవరిలో 16వ ర్యాంక్ సాధించడమే సిరాజ్‌కు అత్యుత్తమం. ఇక, ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో కేవలం మూడు టెస్టులే ఆడిన బుమ్రా నెంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 25 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌లో నిలిచాడు. బ్యాటర్లలో యశస్వీ జైస్వాల్ మూడు స్థానాలు మెరుగై 5వ ర్యాంక్‌కు చేరాడు. పంత్ ఓ స్థానం చేజారి 8వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు రూట్, బ్రూక్ వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
నువ్వు గొప్పోడివి
ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టిన సిరాజ్‌ను కోహ్లీ సోదరి భావనా కోహ్లీ ఽథింగార ప్రశంసల్లో ముంచెత్తింది. ‘అభిమానులను అలరించడంలో క్రికెట్ ఎప్పుడూ విఫలం కాదు. మనలో స్ఫూర్తి నింపుతూ, ఆత్మవిశ్వాసం కల్పిస్తూ, నమ్మకం పెంచి, సానుకూల దృక్పథం కలిగించే హీరోలు ఎప్పుడూ ఈ ఆటలో ఉంటారు. అలాంటి వారిలో నీవు ఒకడివి’ అని ఇన్‌స్టాలో భావన ఉద్వేగభరిత పోస్ట్ చేసింది. లార్డ్స్‌లో ఉద్విగ్నభరితంగా ఉన్న, ఓవల్ మ్యాచ్‌లో సంబరాలు చేసుకుంటున్న సిరాజ్ ఫొటోలను ఆ పోస్ట్‌కు జత చేసింది.
సిరాజ్‌కు కోహ్లీ సోదరి ప్రశంస
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 07 , 2025 | 03:17 AM