ఆపరేషన్ సిందూర్ సమయంలో అమ్మానాన్న పీఓకేలో ఉన్నారు
ABN, Publish Date - May 20 , 2025 | 04:06 AM
ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన సమయంలో త న తల్లిదండ్రులు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉన్నారని కోల్‌క్‌తా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ వెల్లడించాడు...
ఆపరేషన్ సిందూర్ సమయంలో..
అమ్మానాన్న పీఓకేలో ఉన్నారు
లండన్: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన సమయంలో త న తల్లిదండ్రులు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉన్నారని కోల్‌క్‌తా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ వెల్లడించాడు. ‘ఆ సమయంలో నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. వారు ఉన్న ప్రాంతానికి గంట ప్రయాణ దూరంలోనే దాడులు జరిగాయి. అందుబాటులో ఉన్న విమానమెక్కి వారు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. అప్పుడు కానీ నా మనస్సు కుదుటపడలేదు’ అని మొయిన్ తెలిపాడు. మొయిన్ అలీ తాత పీఓకేలోని మిర్పూర్‌కు చెందిన వారు. ఆయన చిన్న తనంలోనే బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డారు. ఓ బ్రిటిష్ మహిళను మొయిన్ తాత వివాహం చేసుకున్నారు. బర్మింగ్‌హామ్‌లో మొయిన్ అలీ జన్మించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 20 , 2025 | 04:06 AM