పాక్ చీఫ్ కోచ్‌గా మైక్ హెస్సన్
ABN, Publish Date - May 14 , 2025 | 04:01 AM
లాహోర్: వన్డే, టీ20లకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మైక్ హెస్సన్ నియమితుడయ్యాడు. ఈనెల 26న హెస్సన్ బాధ్యతలు తీసుకుంటాడని...
లాహోర్: వన్డే, టీ20లకు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మైక్ హెస్సన్ నియమితుడయ్యాడు. ఈనెల 26న హెస్సన్ బాధ్యతలు తీసుకుంటాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ కోచ్ ఉద్యోగానికి మొత్తం ఏడుగురు దరఖాస్తు చేసుకోగా వడపోత అనంతరం హెస్సన్‌ను నియమించారు. పాక్ 2023 నుంచి నియమించిన విదేశీ కోచ్‌ల్లో హెస్సన్ ఐదో వాడు కావడం విశేషం. బ్రాడ్‌బర్న్, ఆర్థర్, కిర్‌స్టెన్, గిలెస్పీ తమ ఒప్పందకాలం ముగియకుండానే కోచ్‌లుగా వైదొలిగారు. న్యూజిలాండ్‌కు చెందిన హెస్సన్ గతంలో కెన్యా, కివీస్, ఐపీఎల్‌లోని ఆర్‌సీబీ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 14 , 2025 | 04:01 AM