Macau Open 2025: నేటి నుంచి మకావు ఓపెన్
ABN, Publish Date - Jul 29 , 2025 | 05:41 AM
భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి ఈ సీజన్‌లో పలు టోర్నీలలో నిలకడగా రాణిస్తున్నా టైటిల్ మాత్రం అందడం లేదు. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి జరిగే మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో...
మకావు: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి ఈ సీజన్‌లో పలు టోర్నీలలో నిలకడగా రాణిస్తున్నా టైటిల్ మాత్రం అందడం లేదు. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి జరిగే మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలవాలని వారు పట్టుదలగా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్, ఆయుష్, మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, అనుపమ, ఆకర్షి తలపడుతున్నారు. డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా, ప్రియ/శ్రుతి, మిక్స్‌డ్‌లో ధ్రువ్/తనీష, రుత్విక/రోహన్ బరిలో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..
‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 29 , 2025 | 05:41 AM