Liam Dawson: ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి
ABN, Publish Date - Jul 16 , 2025 | 03:12 AM
మాంచెస్టర్ వేదికగా ఈనెల 23 నుంచి జరుగబోయే నాలుగో టెస్టు కోసం 14 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. అయితే చేతి వేలు ఫ్రాక్చర్ కావడంతో స్పిన్నర్ షోయబ్ బషీర్ మిగిలిన...
స్పిన్నర్ డాసన్‌ను ఎంపిక చేసిన ఇంగ్లండ్
లండన్: మాంచెస్టర్ వేదికగా ఈనెల 23 నుంచి జరుగబోయే నాలుగో టెస్టు కోసం 14 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. అయితే చేతి వేలు ఫ్రాక్చర్ కావడంతో స్పిన్నర్ షోయబ్ బషీర్ మిగిలిన రెండు టెస్టులకు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో 35 ఏళ్ల స్పిన్నర్ లియామ్ డాసన్ (35)కు చోటు కల్పించారు. 2017లో చివరిసారిగా అతను ఇంగ్లండ్ తరఫున మూడు టెస్టులు ఆడి ఏడు వికెట్లు తీయగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాటింగ్‌లోనూ రాణించి 18 శతకాలతో 10,731 పరుగులు చేయడం విశేషం. ఇక పేసర్లు సామ్ కుక్, ఒవర్టన్‌ను కౌంటీల్లో ఆడేందుకు విడుదల చేశారు.
ఇంగ్లండ్ జట్టు: స్టోక్స్ (కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బెథెల్, బ్రూక్, కార్స్, క్రాలే, డాసన్, డకెట్, పోప్, రూట్, స్మిత్, టంగ్, వోక్స్.
ఇవీ చదవండి:
లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 16 , 2025 | 03:12 AM