ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అదృష్టవంతుణ్ణి

ABN, Publish Date - Jun 13 , 2025 | 02:15 AM

ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లో ఆడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కరుణ్‌ నాయర్‌ చెప్పాడు. 33 ఏళ్ల నాయర్‌ ఇంగ్లండ్‌ లయన్స్‌తో...

టెస్టుల్లో రీఎంట్రీపై కరుణ్‌ నాయర్‌

లండన్‌: ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లో ఆడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కరుణ్‌ నాయర్‌ చెప్పాడు. 33 ఏళ్ల నాయర్‌ ఇంగ్లండ్‌ లయన్స్‌తో తొలి అనధికార టెస్ట్‌లో భారత్‌ ‘ఎ’ తరపున డబుల్‌ సెంచరీ చేయడం ద్వారా..ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు తుది జట్టులో చోటుకు బలంగా రేస్‌లో నిలిచాడు. ‘చాలాకాలం తర్వాత టెస్ట్‌లు ఆడే అవకాశం రానుండడం గొప్ప అనుభూతి కలిగిస్తోంది’ అని కరుణ్‌ అన్నాడు. 2018లో ఇంగ్లండ్‌ పర్యటనకు భారత జట్టులో నాయర్‌ ఉన్నాడు. కానీ అప్పుడు జరిగిన ఐదు టెస్ట్‌లకూ అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక..గత సీజన్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో విదర్భ రంజీ టైటిల్‌ గెలవడంలో కరుణ్‌ కీలకపాత్ర పోషించాడు.

ఇవీ చదవండి:

టీమిండియాకు రెండే ఆప్షన్లు

బీసీసీఐ కొత్త రూల్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 02:15 AM