‘ఫ్యామిలీ’కి ఓకే..కానీ
ABN, Publish Date - Mar 19 , 2025 | 05:20 AM
క్రికెటర్ల విదేశీ పర్యటనలో కుటుంబసభ్యులు ఉంటే మంచిదేనని, అయితే జట్టు ప్రయోజనాలు కూడా ముఖ్యమని దిగ్గజ ఆటగాడు...
న్యూఢిల్లీ: క్రికెటర్ల విదేశీ పర్యటనలో కుటుంబసభ్యులు ఉంటే మంచిదేనని, అయితే జట్టు ప్రయోజనాలు కూడా ముఖ్యమని దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అన్నాడు. ఇటీవల విరాట్ కోహ్లీ బీసీసీఐ ఫ్యామిలీ నిబంధనపై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘ఫ్యామిలీని దూరంగా ఉంచాలనేది క్రికెట్ బోర్డు నిర్ణయం. నా దృష్టిలో క్రికెటర్లతో పాటు కుటుంబసభ్యులు ఉండడం అవసరమే. అదే సమయంలో వారు జట్టుకు కూడా ప్రాధాన్యమివ్వాలి. మా సమయంలో బోర్డుతో పనిలేకుండా టూర్ ఆరంభంలో మేమే కుటుంబాలను దూరం పెట్టేవాళ్లం. ఆ తర్వాత టూర్ ద్వితీయార్థంలో నెమ్మదిగా కుటుంబాలు వచ్చి కలిసేవి. అలా సమతూకంగా వ్యవహరించేవాళ్లం’ అని కపిల్ వివరించాడు.
ఇవీ చదవండి:
యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్
ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 19 , 2025 | 05:20 AM