కనక్‌కు స్వర్ణం
ABN, Publish Date - May 22 , 2025 | 03:52 AM
భారత యువ షూటర్ కనక్ ఐఎ్‌సఎ్‌సఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. జర్మనీలోని సుల్ నగరంలో బుధవారం జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోని మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో...
న్యూఢిల్లీ: భారత యువ షూటర్ కనక్ ఐఎ్‌సఎ్‌సఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. జర్మనీలోని సుల్ నగరంలో బుధవారం జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోని మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో 17 ఏళ్ల కనక్ 239 పాయిం ట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. మాల్దోవాకు చెందిన అన్నా డుల్క్‌కు రజతం, తైపీ షూటర్ యెన్ చెంగ్‌కు కాంస్యం దక్కాయి.
నగాల్ పరాజయం
పారిస్: భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో సుమిత్ 2-6, 4-6తో జూరిజ్ రోడియోనోవ్ (ఆస్ట్రియా) చేతిలో చిత్తయ్యాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో మిచెల్ క్రూగెర్ (అమెరికా)పై సుమిత్ గెలిచాడు.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 22 , 2025 | 03:52 AM