జ్యోతికి పసిడి
ABN, Publish Date - Jun 08 , 2025 | 04:34 AM
తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఏకంగా ఆరు స్వర్ణాలు కొల్లగొట్టారు. వీరిలో తెలుగమ్మాయిలు ఉండడం విశేషం...
రిలేలో నిత్య బృందానికి స్వర్ణం
తైవాన్ అథ్లెటిక్స్
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఏకంగా ఆరు స్వర్ణాలు కొల్లగొట్టారు. వీరిలో తెలుగమ్మాయిలు ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.99 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకం అందుకొంది. మహిళల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజాస్ షిర్సే 13.52 సెకన్లతో స్వర్ణం సాధించగా.. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ (4 నిమిషాల 11.63 సెకన్లు), పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ (16.21 మీటర్లు) విజేతలుగా నిలిచారు. ఇక, 4గీ100 మీటర్ల రిలే ఈవెంట్లలో తెలంగాణకు చెందిన నిత్య గంధె, సుధీక్ష వడ్లూరి, స్నేహ సత్యనారాయణ షనువల్లి, అభినయ రాజరాజన్‌లతో కూడిన మహిళల జట్టు (44.06 సెకన్లు).. గుర్విందర్, అనిమేశ్, మనికంఠ, అమ్లాన్‌లతో కూడిన పురుషుల బృందం (38.75 సె) పసిడి పతకాలు దక్కించుకొన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 08 , 2025 | 04:34 AM