ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జ్యోతి సురేఖ జోడీ ప్రపంచ రికార్డు

ABN, Publish Date - Jul 10 , 2025 | 05:15 AM

తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ/రిషభ్‌ యాదవ్‌ ద్వయం కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ప్రపంచ రికార్డు తిరగ రాసింది. వరల్డ్‌ కప్‌ ఆర్చరీ నాలుగో దశలో భాగంగా...

మాడ్రిడ్‌: తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ/రిషభ్‌ యాదవ్‌ ద్వయం కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో ప్రపంచ రికార్డు తిరగ రాసింది. వరల్డ్‌ కప్‌ ఆర్చరీ నాలుగో దశలో భాగంగా బుధవారం జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో భారత జోడీ సంయుక్తంగా 1431 పాయింట్లు సాధించారు. వీటిలో జ్యోతి సురేఖ 715, రిషభ్‌ 716 పాయింట్లతో నిలిచారు. దాంతో డెన్మార్క్‌ ద్వయం గెలెంతియన్‌/ఫులెర్టన్‌ పేరిట 1429 పాయింట్లతో 2023 నుంచి ఉన్న గత వరల్డ్‌ రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. ఇక..కాంపౌండ్‌ మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకుపోవడంతో భారత్‌కు ఒక పతకం ఖరారైంది. మరోవైపు పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్లో పరాజయం చవిచూసింది. జ్యోతి సురేఖ, ప్రణీత్‌ కౌర్‌, ప్రతీకతో కూడిన భారత త్రయం సెమీఫైనల్లో 230-226తో ఇండోనేసియాను ఓడించింది. స్వర్ణం కోసం శనివారం జరిగే పోరులో 10వ సీడ్‌ చైనీస్‌ తైపీ జట్టుతో జ్యోతి త్రయం తలపడనుంది.

ఇవీ చదవండి:

కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!

గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!

ఆడలేక మద్దెల దరువు అంటే ఇదే!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 05:15 AM