ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్చర్‌ వచ్చేశాడు

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:53 AM

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చేనెల 2 నుంచి భారత్‌తో జరగబోయే రెండో టెస్టు కోసం...

రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు

బర్మింగ్‌హామ్‌: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఇంగ్లండ్‌ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చేనెల 2 నుంచి భారత్‌తో జరగబోయే రెండో టెస్టు కోసం 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు గురు వారం ప్రకటించారు. 30 ఏళ్ల ఆర్చర్‌ రాకతో ఇప్పటికే ఐదు టెస్టుల సిరీ్‌సలో భారత్‌పై 1-0 ఆధిక్యంలో ఉన్న స్టోక్స్‌ సేన బౌలింగ్‌ మరింత పటిష్టం కానుంది. కొన్నేళ్లుగా గాయాలతో సతమతమవుతున్న తను చివరిసారిగా 2021, ఫిబ్రవరిలో భారత్‌పైనే టెస్టు ఆడాడు. ఇక ఆర్చర్‌ మినహా తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

జట్టిదే:

బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), క్రాలే, డకెట్‌, బ్రూక్‌, రూట్‌, స్మిత్‌, పోప్‌, సా మ్‌ కుక్‌, ఒవర్టన్‌, వోక్స్‌, బషీర్‌, ఆర్చర్‌, బెథెల్‌, టంగ్‌, కార్స్‌.

Updated Date - Jun 27 , 2025 | 05:53 AM