Para Powerlifting: మాథ్యూకు స్వర్ణ, రజతాలు
ABN, Publish Date - Jun 23 , 2025 | 02:45 AM
పారా పవర్‌లిఫ్టింగ్ వరల్డ్‌కప్ తొలి రోజే భారత్ స్వర్ణం సహా 4 పతకాలతో అదరగొట్టింది. మాస్టర్స్ విభాగంలో జోబీ మాథ్యూ ఓ స్వర్ణం, ఓ రజతం సాధించాడు.
పారా పవర్‌లిఫ్టింగ్ వరల్డ్‌కప్
బీజింగ్: పారా పవర్‌లిఫ్టింగ్ వరల్డ్‌కప్ తొలి రోజే భారత్ స్వర్ణం సహా 4 పతకాలతో అదరగొట్టింది. మాస్టర్స్ విభాగంలో జోబీ మాథ్యూ ఓ స్వర్ణం, ఓ రజతం సాధించాడు. మాథ్యూ వరుసగా 145, 150 కిలోలు ఎత్తాడు. మొత్తం లిఫ్ట్‌లో స్వర్ణం, బెస్ట్ లిఫ్ట్‌లో రజతాన్ని జోబీ సొంతం చేసుకొన్నాడు. పురుషుల 72 కిలోల విభాగంలో రాముభాయ్, 59 కి.లలో గుల్ఫామ్ కంచు పతకాలు సాధించారు. 2026 వరల్డ్ చాంపియన్‌షిప్స్, 2028 పారాలింపిక్స్‌కు ఇది క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో 40 దేశాలకు చెందిన టాప్ లిఫ్టర్లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు.
Updated Date - Jun 23 , 2025 | 02:47 AM