Indian badminton exit: జపాన్ ఓపెన్ మన కథ ముగిసెన్
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:30 AM
జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కథ ముగిసింది. బరిలో మిగిలిన సాత్విక్ జోడీ, లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్‌లో పరాజయంతో ఇంటిబాట పట్టారు...
సాత్విక్ జంట, లక్ష్యసేన్ ఓటమి
టోక్యో: జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కథ ముగిసింది. బరిలో మిగిలిన సాత్విక్ జోడీ, లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్‌లో పరాజయంతో ఇంటిబాట పట్టారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ 19-21, 11-21తో కొడాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయాడు. ఇక సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీ 22-24, 14-21తో చైనా జంట లియాంగ్ వీ కెంగ్/వాంగ్ చాంగ్ చేతిలో ఓటమి చవి చూసింది. అనుపమా ఉపాధ్యాయ 21-13, 11-21, 12-21తో వాంగ్ ఝీ హీ (చైనా) చేతిలో పోరాడి ఓడింది.
ఇవి కూడా చదవండి
ఊహించని విషాదం.. 9 ఏళ్ల బాలికకు గుండెపోటు..
ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..
Updated Date - Jul 18 , 2025 | 05:30 AM