ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తొలి అడుగు ఎవరిదో

ABN, Publish Date - May 29 , 2025 | 03:36 AM

ఐపీఎల్‌ తుది అంకానికి సమయం ఆసన్నమైంది. దశాబ్దం తర్వాత ప్లేఆ్‌ఫ్సకు చేరిన జోష్‌లో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) రూపంలో అసలుసిసలు సవాల్‌ ఎదురుకానుంది. ఈ మెగా లీగ్‌లో...

నేటి క్వాలిఫయర్‌-1లో

పంజాబ్‌తో బెంగళూరు ఢీ, రా.7.30 నుంచి

ఐపీఎల్‌ టైటిల్‌ వేటలోనున్న పంజాబ్‌, బెంగళూరు ఫైనల్లో చోటు కోసం అమీతుమీకి సిద్ధమయ్యాయి. శ్రేయాస్‌ సారథ్యంలోని కింగ్స్‌ జట్టు లీగ్‌ దశలో ‘టాప్‌’లేపి సూపర్‌ జోష్‌తో కనిపిస్తుండగా.. కోహ్లీలాంటి స్టార్లతో కూడిన బెంగళూరు ఆఖరి మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి.. ఈ సమవుజ్జీల సమరంలో పైచేయి సాధించి ఫైనల్లో తొలి అడుగు వేసేదెవరో నేడు తేలనుంది.

ముల్లన్‌పూర్‌: ఐపీఎల్‌ తుది అంకానికి సమయం ఆసన్నమైంది. దశాబ్దం తర్వాత ప్లేఆ్‌ఫ్సకు చేరిన జోష్‌లో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) రూపంలో అసలుసిసలు సవాల్‌ ఎదురుకానుంది. ఈ మెగా లీగ్‌లో సమవుజ్జీలుగా కనిపిస్తున్న పంజాబ్‌, బెంగళూరు జట్లు గురువారం జరిగే క్వాలిఫయర్‌-1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలతో పంజాబ్‌, బెంగళూరు 19 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే, మెరుగైన రన్‌రేట్‌తో పంజాబ్‌ టాప్‌లో నిలిచింది. 2014లో చివరిసారి నాకౌట్‌ చేరిన పంజాబ్‌.. ఈసారి అందరి అంచనాలను తారుమారు చేస్తూ అనూహ్యంగా టాప్‌లో నిలిచింది. జట్టును ఈస్థాయిలో నిలపడంలో కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌, కోచ్‌ రికీ పాంటింగ్‌ కృష్టి ఎంతో ఉంది.


ఇక, ఓపెనర్లు ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అదిరే ఆరంభాన్నిస్తుంటే.. ఇంగ్లిస్‌, అయ్యర్‌, నేహల్‌ వధేరా మిడిలార్డర్‌లో వెన్నెముకగా నిలుస్తున్నారు. శశాంక్‌ సింగ్‌, స్టొయినిస్‌ ఫినిషర్లుగా అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌ అండగా నిలుస్తున్నారు. దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సెన్‌ స్వదేశానికి తిరిగివెళ్లడంతో అతడి స్థానంలో ఒమర్జాయ్‌కు తుదిజట్టులో చోటు దక్కొచ్చు. గాయం నుంచి కోలుకున్న లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ ఈ మ్యాచ్‌లో ఆడే చాన్సుంది.

దూకుడుగా ఆర్‌సీబీ: సుదీర్ఘ కాలం తర్వాత ఆర్‌సీబీ టాప్‌-2లో నిలిచింది. లీగ్‌ దశలో అదిరే ప్రదర్శన చేసిన బెంగళూరు.. ఆఖరి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జోష్‌లో ఉంది. ఓపెనర్లు సాల్ట్‌, కోహ్లీ దూకుడైనా ఆరంభాన్నిస్తుండగా.. మిడిలార్డర్‌లో తాత్కాలిక కెప్టెన్‌ జితేశ్‌ శర్మ ప్రదర్శన కీలకంగా మారింది. గాయపడిన టిమ్‌ డేవిడ్‌ సెలెక్షన్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక, హాజెల్‌వుడ్‌ ఫుల్‌ ఫిట్‌నెస్‌ సాధించడంతో బౌలింగ్‌ బలం పెరిగింది. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌తోపాటు స్పిన్నర్లు క్రునాల్‌ పాండ్యా, సుయాష్‌ శర్మ జట్టుకు ఉపయోగపడుతున్నారు. ఇదే పిచ్‌పై జరిగిన ఓ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపొందడం బెంగళూరుకు సానుకూలాంశం. మరోవైపు, సొంతగడ్డపై విజయంతో నేరుగా ఫైనల్‌ బెర్త్‌ పట్టేయాలని అయ్యర్‌ సేన పట్టుదలతో ఉంది.

జట్లు (అంచనా)

పంజాబ్‌: ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, జోష్‌ ఇంగ్లిస్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నేహల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, స్టొయినిస్‌, ఒమర్జాయ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, కైల్‌ జేమిసన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, చాహల్‌ (ఇంపాక్ట్‌ సబ్‌)

బెంగళూరు: కోహ్లీ, సాల్ట్‌, మయాంక్‌ అగర్వాల్‌, రజత్‌ పటీదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), క్రునాల్‌ పాండ్యా, లివింగ్‌స్టోన్‌, రొమారియో షెఫర్డ్‌, భువనేశ్వర్‌, యష్‌ దయాళ్‌, హాజెల్‌వుడ్‌, సుయాష్‌ శర్మ (ఇంపాక్ట్‌ సబ్‌).


పిచ్‌/వాతావరణం..

ముల్లాన్‌పూర్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో 200పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఆ తర్వాతి మ్యాచ్‌లో 111 పరుగులను పంజాబ్‌ కాపాడుకొంది. మరో మ్యాచ్‌లో పంజాబ్‌ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించింది. మరి నేటి కీలక మ్యాచ్‌కు ఎలాంటి వికెట్‌ను ఎంపిక చేస్తారో చూడాలి. వాతావరణం సాధారణంగా పొడిగా ఉండనుంది. వర్షఛాయలు లేవు.

ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే..?

షెడ్యూల్‌ ప్రకారం క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. దీంతో ఏదైనా కారణంతో ఈ మ్యాచ్‌ రద్దయితే, పంజాబ్‌ నేరుగా ఫైనల్‌ చేరుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది కాబట్టి శ్రేయాస్‌ సేనకు తుదిబెర్త్‌ దక్కుతుంది. అయితే, వర్ష సూచన లేదు కాబట్టి, మ్యాచ్‌ పూర్తిగా జరిగే అవకాశముంది.

ఇవీ చదవండి:

హీరోలను మించిన లుక్‌లో రాహుల్!

కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 02:58 PM