IPL Ticket Refund: టికెట్ డబ్బులు వాపస్
ABN, Publish Date - May 10 , 2025 | 05:31 AM
ఐపీఎల్ వాయిదా నేపథ్యంలో టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు రీఫండ్ ప్రక్రియ ప్రారంభమైంది. సన్‌రైజర్స్ యాజమాన్యం అధికారికంగా డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపింది.
Refund Update: ఐపీఎల్ అర్థంతరంగా వాయిదా పడిన నేపథ్యంలో.. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లకు టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు ఫ్రాంచైజీలు డబ్బులను తిరిగి చెల్లిస్తున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం బెంగళూరులో లఖ్‌నవూ, బెంగళూరు.. శనివారం హైదరాబాద్‌లో సన్‌రైజర్స్, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌లు జరగాల్సింది. కానీ, ఐపీఎల్ వాయిదాతో ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు రీఫండ్ చేయనున్నట్టు సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రకటించింది.
Updated Date - May 10 , 2025 | 05:32 AM