IPL 2025 SRH Vs GT: టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్..
ABN, Publish Date - May 02 , 2025 | 07:20 PM
గుజరాత్‌తో జరుగుతున్న నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది.
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ మరికాసేపట్లో మొదలు కానుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఎస్‌ఆర్‌హెచ్ (ప్లేయింగ్ ఎలెవెన్): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కత్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమి.
ఇంపాక్ట్ సబ్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, ట్రావిస్ హెడ్, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్
గుజరాత్ టైటన్స్ ప్లెయింగ్ ఎలెవెన్: సాయి సుదర్శన్, షుబ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, గెరాల్ట్ కొయెట్జీ, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ
ఇంపాక్ట్ సబ్స్: ఇషాంత్ శర్మ, మహిపాల్ లామ్రోర్, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, షెర్పాన్ రూథర్‌ఫోర్డ్
ఐపీఎల్‌లో ఇప్పటివరకరూ గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య నాలుగు పూర్తి మ్యాచ్‌లు జరగ్గా హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. గుజరాత్ మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. గుజరాత్‌కు ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైనప్పటికీ తొలి రెండు పొజిషన్లలో నిలిస్తే ఫైనల్స్ చేరడం మరింత సులువవుతుంది. ఈ దృష్ట్యా గుజరాత్‌కు ఈ మ్యాచ్ కీలకం. ఇక ప్లేఆఫ్స్‌లో చోటు దక్కాలంటే ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో గెలవాలి. దీంతో, హైదరాబాద్ అభిమానులకు ఈ మ్యాచ్ కచ్చితంగా ఉత్కంఠ భరితం కానుంది. ఇక పిచ్ బ్యాటర్స్‌కు అనుకూలమైనప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - May 02 , 2025 | 07:46 PM