INDW vs IREW: తొలిసారి 400 కంటే ఎక్కువ స్కోర్.. పురుషుల రికార్డ్ బ్రేక్ చేసిన భారత మహిళల జట్టు
ABN, Publish Date - Jan 15 , 2025 | 07:03 PM
భారత మహిళల జట్టు సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో తొలిసారిగా రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 400+ స్కోరును సాధించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత మహిళల క్రికెట్ జట్టు (team india womens) చరిత్ర సృష్టించింది. 2025 జనవరి 14న రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఐర్లాండ్ (rajkot) మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు తొలిసారి 400+ స్కోరును సాధించారు. ఆ క్రమంలో ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక్ రావల్ అద్భుతమైన సెంచరీలతో భారత జట్టును 50 ఓవర్లలో 435/5 భారీ స్కోరుకు తీసుకెళ్లారు. ఈ స్కోరు భారత క్రికెట్ చరిత్రలో, పురుషులు, మహిళలు ఇద్దరూ వన్డేల్లో సాధించిన అత్యధిక జట్టు స్కోరుగా నిలవడం విశేషం.
రికార్డుగా మారిన 435/5 స్కోర్
దీంతో ఇది భారత క్రికెట్ చరిత్రలో మహిళల జట్టుకు వచ్చిన మొదటి 400+ స్కోరుగా నిలిచింది. ఈ క్రమంలో స్మృతి మంధాన (135), ప్రతీక్ రావల్ (154) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ చేసి ఐర్లాండ్ జట్టు ముందు చాలా పెద్ద లక్ష్యాన్ని ఉంచారు. స్మృతి మంధాన 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 135 పరుగులు చేయగా, ప్రతీక్ రావల్ 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్సర్‌తో తన మొదటి వన్డే సెంచరీని 154 పరుగులుగా మార్చుకుంది.
ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది భారత మహిళల జట్టులో అత్యంత పెద్ద భాగస్వామ్యం. రిచా ఘోష్ కూడా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆమె 42 బంతుల్లో 59 పరుగులు చేసి కీలకంగా జట్టుకు మద్దతు ఇచ్చింది. మొత్తం మీద భారత మహిళలు 48 ఫోర్లు, 9 సిక్సర్లతో 435/5 స్కోరును నమోదు చేసి ఐర్లాండ్ జట్టును పరాభవం చేసేందుకు ఒక గొప్ప అవకాశాన్ని సిద్ధం చేసుకుంది.
భారత్ పురుషుల రికార్డు బ్రేక్
ఈ రికార్డ్ సందర్భంగా భారత పురుషుల జట్టు స్కోర్ గురించి చూస్తే 2011లో వెస్టిండీస్‌పై చేసిన 418/5 పరుగులను మాత్రమే చేసింది. కానీ ఇప్పుడు భారత మహిళల జట్టు 435/5 స్కోర్ చేసి పురుషుల రికార్డ్ బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. 2011లో సేహ్వాగ్ అద్భుతమైన డబుల్ సెంచరీ చేసి ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు భారత మహిళల జట్టు తన ప్రతిభను చూపిస్తూ 400+ స్కోరు సాధించడాన్ని ప్రేక్షకులు ఎంతో ప్రశంసిస్తున్నారు. దీంతోపాటు అనేక మంది క్రీడాభిమానులు గ్రేట్ అంటూ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.
మహిళల వన్డేలో అత్యధిక స్కోర్లు ఇవే
భారత మహిళల జట్టు ఇప్పుడు వన్డేలో అత్యధిక స్కోరు సాధించిన జట్లలో నాలుగో స్థానంలో నిలిచింది.
491/4 - న్యూజిలాండ్ vs ఐర్లాండ్ (2018)
455/5 - న్యూజిలాండ్ vs పాకిస్తాన్ (1997)
440/3 - న్యూజిలాండ్ vs ఐర్లాండ్ (2018)
435/5 - భారత్ vs ఐర్లాండ్ (2025)
భారత మహిళల జట్టుకు పెరుగుతున్న క్రేజ్
ఈ రికార్డుతో భారత మహిళల జట్టు తన స్థాయిని మరోసారి పెంచుకుంది. ఇది ఆడుతున్న ప్రతి మహిళలకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు క్రికెట్‌లో మహిళల కృషి ఎలా విజయవంతం కావచ్చో అందరికీ చూపించారని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Lay offs: ఈ కారణంతో వేల మందిని తొలగిస్తున్న మెటా.. ఉద్యోగుల ఆగ్రహం..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News
Updated Date - Jan 15 , 2025 | 07:05 PM