ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Womens Cricket Team: మనమ్మాయిలకు భలే చాన్స్‌

ABN, Publish Date - Jun 28 , 2025 | 04:57 AM

భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో తెల్లబంతుల పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20లు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీ్‌సకోసం ఇక్కడికి వచ్చిన హర్మన్‌ సేన.. శనివారం జరిగే మొదటి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది.

  • రా. 7 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

  • పొట్టి ప్రపంచకప్‌పై నజర్‌

  • ఇంగ్లండ్‌తో నేడు తొలి టీ20

నాటింగ్‌హామ్‌: భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో తెల్లబంతుల పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20లు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీ్‌సకోసం ఇక్కడికి వచ్చిన హర్మన్‌ సేన.. శనివారం జరిగే మొదటి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చే పొట్టి ప్రపంచ కప్‌లో స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు తాజా సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భారత్‌ భావిస్తోంది. తద్వారా రాబోయే టీ20 ప్రపంచ కప్‌ జట్టు ఎంపిక సులువవుతుంది. డ్యాషింగ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మ పునరాగమనం జట్టుకు అదనపు బలం. ఇంకా..తెలుగమ్మాయి శ్రీచరణి, క్రాంతి గౌడ్‌, సయాలీ సత్ఘరే వంటి యువ రక్రికెటర్లకు జట్టులో చోటు కల్పించారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఉమా ఛెత్రి విఫలమవుతున్న నేపథ్యంలో స్మృతి మంధానాతో కలిసి షఫాలీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనుంది. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అమన్‌ జోత్‌ కౌర్‌ ఎలా రాణిస్తారో చూడాలి. సీనియర్‌ పేసర్లు రేణుకా సింగ్‌, పూజా వస్ర్తాకర్‌ గాయాలతో జట్టుకు దూరం కావడం టీమిండియాకు ప్రతికూలం కానుంది. మరోవైపు కెప్టెన్‌ నాట్‌-సివర్‌ బ్రంట్‌కుతోడు అమీ జోన్స్‌, బ్యూమాంట్‌, డానీ వ్యాట్‌, ఎకిల్‌స్టోన్‌ వంటి అత్యంత అనుభవజ్ఞులతో ఇంగ్లండ్‌ పటిష్టంగా ఉంది.

Updated Date - Jun 28 , 2025 | 04:59 AM