Legends World Cup: పాకిస్థాన్‌తో సెమీస్ ఆడం
ABN, Publish Date - Jul 31 , 2025 | 05:27 AM
పాకిస్థాన్‌తో గురువారం జరగాల్సిన టీ20 లెజెండ్స్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప సెమీఫైనల్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు భారత జట్టు ప్రకటించింది...
టోర్నీ నుంచి వైదొలగిన భారత్
ఆడకుండానే ఫైనల్‌కు పాక్
లెజెండ్స్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప
బర్మింగ్‌హామ్: పాకిస్థాన్‌తో గురువారం జరగాల్సిన టీ20 లెజెండ్స్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప సెమీఫైనల్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు భారత జట్టు ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీ్‌సలు ఆడకూడదన్న నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పాక్‌తో మ్యాచ్ నుంచి వైదొలగుతున్నట్టు భారత లెజెండ్స్ తెలిపారు. ఈ టోర్నీ లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌నూ భారత్ బహిష్కరించింది. శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్ (కెప్టెన్), ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి మాజీ స్టార్లు భారత జట్టులో ఉన్నారు. భారత జట్టు వైదొలగాలన్న నిర్ణయంతో పాక్ ఆడకుండానే టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఆస్ర్టేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం జరిగే సెమీఫైనల్ విజేతతో పాక్ ఫైనల్లో తలపడుతుంది. భారత్ సహా మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
ఇవి కూడా చదవండి..
మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 31 , 2025 | 05:27 AM