ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్టోబరులో ఆసీస్‌ పర్యటనకు..

ABN, Publish Date - Mar 31 , 2025 | 02:34 AM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఈ ఏడాది కూడా అక్కడ పర్యటించబోతోంది. అయితే ఈసారి టెస్టు సిరీస్‌ కోసం కాకుండా వన్డే, టీ20ల్లో...

మెల్‌బోర్న్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఈ ఏడాది కూడా అక్కడ పర్యటించబోతోంది. అయితే ఈసారి టెస్టు సిరీస్‌ కోసం కాకుండా వన్డే, టీ20ల్లో తలపడేందుకు వెళ్లనుంది. అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం భారత్‌ తమ దేశానికి రానుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. పెర్త్‌, అడిలైడ్‌, సిడ్నీలలో వన్డేలు జరుగనుండగా.. అక్టోబరు 29 నుంచి కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌, హోబర్ట్‌, గోల్డ్‌కోస్ట్‌, బ్రిస్బేన్‌లలో టీ20లు నిర్వహించనున్నారు. సెప్టెంబరులో జరిగే ఆసియాకప్‌ తర్వాత భారత జట్టు ఆసీస్‌ టూర్‌కు వెళ్లనుంది.


వచ్చే ఏడాది మహిళల జట్టు కూడా..: భారత మహిళల జట్టు కూడా వచ్చే ఏడాది మూడు ఫార్మాట్ల సిరీస్‌ కోసం ఆసీస్‌ పర్యటనకు రానుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. భారత్‌-ఆసీ్‌స మహిళల జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు మూడు టీ20లు, 24 నుంచి మార్చి 1 వరకు మూడు వన్డేలతో పాటు మార్చి 6-9 మధ్య ఏకైక టెస్టు జరుగుతుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా

IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్

IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 31 , 2025 | 02:34 AM