పాక్ కంటే భారత్ జట్టే మెరుగైనది: ప్రధాని మోదీ..
ABN, Publish Date - Mar 17 , 2025 | 01:21 AM
పాకిస్థాన్ కంటే భారత క్రికెట్ జట్టు మెరుగైనదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆదివారం లెక్స్ ఫ్రిడ్‌మన్ అనే అమెరికా పాడ్‌కాస్టర్ నిర్వహించిన చర్చలో మోదీ పాల్గొన్నారు...
ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కంటే భారత క్రికెట్ జట్టు మెరుగైనదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆదివారం లెక్స్ ఫ్రిడ్‌మన్ అనే అమెరికా పాడ్‌కాస్టర్ నిర్వహించిన చర్చలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెక్స్ అడిగిన పలు క్రీడాసంబంధిత ప్రశ్నలకు మోదీ తనదైన శైలిలో బదులిచ్చారు. తాను క్రీడల్లో నిష్ణాతుడిని కాదని, సాంకేతిక అంశాలు తనకు తెలియదని, అయితే తాజాగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫలితాల ఆధారంగా పాక్ కంటే భారత్ జట్టు మెరుగైందని చెప్పగలనని మోదీ అన్నారు. ప్రపంచంలో గొప్ప ఫుట్‌బాలర్ ఎవరని వ్యాఖ్యాత అడగ్గా.. 80వ దశకంలో డిగో మారడోనాను మించిన వారు లేరు. ఈ తరంలో లియోనెల్ మెస్సీ గొప్ప ఆటగాడని మోదీ చెప్పారు. భారత్‌లోనూ ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరిగిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో ఫుట్‌బాల్‌కున్న ఆదరణ చూసిన ఆశ్చర్యపోయానని అన్నారు. ‘క్రీడలు ప్రజలను దగ్గర చేస్తాయి. ప్రపంచ మొత్తాన్ని ఉత్తేజపరిచే శక్తి క్రీడలకు ఉంది. దేశాలకు అతీతంగా క్రీడా స్ఫూర్తి ప్రజలను దగ్గర చేయగలదు. మానవ పరిణామ క్రమంలో క్రీడలు కీలక పాత్ర పోషించాయి’ అని మోదీ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli On BCCI: తలతిక్క రూల్స్ అవసరమా.. బీసీసీఐపై కోహ్లీ సీరియస్
Australian Grand Prix 2025: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం.. వరల్డ్ చాంపియన్‌కు షాక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 17 , 2025 | 08:20 AM