బోణీ కొట్టేదెవరో?
ABN, Publish Date - Apr 27 , 2025 | 02:31 AM
ఐదు నెలల్లో మహిళల వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో బౌలింగ్‌ను మరింతగా మెరుగులు దిద్దుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో ఆతిథ్య శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి పోటీపడుతున్న...
ఉదయం 10 గం. నుంచి
శ్రీలంకతో భారత్ పోరు నేడు
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్
కొలంబో: ఐదు నెలల్లో మహిళల వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో బౌలింగ్‌ను మరింతగా మెరుగులు దిద్దుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో ఆతిథ్య శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి పోటీపడుతున్న ముక్కోణపు వన్డే సిరీ్‌సను సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకొంటోంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో యువ పేసర్ కష్వీ గౌతమ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శనతో భారత జట్టులో తొలిసారి చోటు పట్టేసిన కష్వీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఇక, హర్మన్, స్మృతి మంధాన, రిచా ఘోష్, హర్లీన్ డియోల్‌తో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే, టిటాస్ సాధు, రేణుక, పూజ గాయాల బారిన పడడంతో బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అరుంధతి, అమన్‌జోత్‌పైనే పేస్ బౌలింగ్ భారం పడనుంది. ఇక, మ్యాచ్‌కు వేదికైన ప్రేమదాస స్టేడియం వికెట్ స్లో బౌలర్లకు అనుకూలం కావడంతో దీప్తి శర్మ, స్నేహ్ రాణాతోపాటు తెలుగమ్మాయి శ్రీ చరణి ఎక్కువ ఓవర్లు బౌల్ చేసే చాన్సులున్నాయి. మరోవైపు చమరి ఆటపట్టు సారథ్యంలో శ్రీలంక జట్టు సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 27 , 2025 | 02:31 AM