మనోళ్ల్లు ఏం చేస్తారో?
ABN, Publish Date - Apr 27 , 2025 | 02:29 AM
ప్రతిష్ఠాత్మక సుదీర్మన్ కప్ మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప ఆదివారం ఇక్కడ ప్రారంభం కానుంది. బ్యాడ్మింటన్‌లో.. వరల్డ్ కప్‌తో సమానంగా భావించే ఈ టోర్నీ ఇప్పటి వరకు...
నేటినుంచి సుదీర్మన్ కప్
తొలిపోరులో డెన్మార్క్‌తో భారత్ ఢీ
గ్జియామెన్ (చైనా): ప్రతిష్ఠాత్మక సుదీర్మన్ కప్ మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప ఆదివారం ఇక్కడ ప్రారంభం కానుంది. బ్యాడ్మింటన్‌లో.. వరల్డ్ కప్‌తో సమానంగా భావించే ఈ టోర్నీ ఇప్పటి వరకు 18సార్లు జరిగితే.. చైనా (13సార్లు), దక్షిణ కొరియా (4సార్లు), ఇండోనేసియా (ఒకసారి) మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఇక..రెండుసార్లు (2011, 2017) క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరడమే ఈ టోర్నీలో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన. డెన్మార్క్, రెండోసీడ్ ఇండోనేసియా, ఇంగ్లండ్‌లతో కలిసి భారత జట్టు గ్రూప్-డి నుంచి తలపడుతోంది. 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరతాయి. ఫైనల్ మే 4న జరగనుంది. పురుషులు, మహిళల స్టార్ జోడీలు సాత్విక్/చిరాగ్, గాయత్రి/ట్రీసా లేకపోవడం భారత జట్టుకు పెద్ద దెబ్బ. ఈనేపథ్యంలో..ప్రతి పోరులో మిక్స్‌డ్ డబుల్స్ ద్వయం ధ్రువ్ కపిల/తనీషా శుభారంభం అందించాల్సి ఉంటుంది. సింగిల్స్‌లో భారత ఆశలన్నీ లక్ష్యసేన్, పీవీ సింధుపైనే. అలాగే అనుభవజ్ఞుడైన ప్రణయ్, అనుపమ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. సాత్విక్/చిరాగ్ అనారోగ్యంతో టోర్నీ నుంచి వైదొలగడంతో హరిహరన్/రూబన్ కుమార్ జంట ఏమాత్రం సత్తా చాటుతుందో చూడాలి.
మహిళల డబుల్స్‌లో శ్రుతి మిశ్రా/ప్రియా కొంజెన్‌బామ్ బరిలో నిలిచారు. సతీష్ కుమార్/ఆద్య మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండో జోడీగా ఉంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆదివారం డెన్మార్క్‌తో ఆడనుంది. ఆ తర్వాత మంగళవారం ఇండోనేసియాతో, గురువారం ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 27 , 2025 | 02:29 AM