ఆఖరి రోజు 4 స్వర్ణాలు
ABN, Publish Date - May 02 , 2025 | 02:09 AM
ఆసియా అండర్-15, అండర్-17 చాంపియన్‌షి్‌పలో ఆఖరిరోజు గురువారం భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు కొల్లగొట్టారు. దాంతో మొత్తం 43 పతకాల...
రెండో స్థానంలో భారత్
ఆసియా బాక్సింగ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా అండర్-15, అండర్-17 చాంపియన్‌షి్‌పలో ఆఖరిరోజు గురువారం భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు కొల్లగొట్టారు. దాంతో మొత్తం 43 పతకాల (15 స్వర్ణ, 6 రజత, 22 కాంస్య)తో భారత్ పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కజకిస్థాన్ అగ్రస్థానం దక్కించుకుంది. అండర్-17 బాలికల విభాగంలో ఖుషీ చంద్ (46కి.), అహానా శర్మ (50కి.), జానత్ (54కి.), అన్షిక (80+) పసిడి పతకాలతో, సిమ్రన్‌జీత్ కౌర్ (60కి.), హర్సిక (63కి.), రజత పతకాలతో టోర్నీని ముగించారు. ఇక..బాలుర అండర్-17 కేటగిరీలో దేవాన్ష్ (80కి.) రజత పతకం అందుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 02 , 2025 | 02:09 AM