Womens Cricket: భారత మహిళల ఓటమి
ABN, Publish Date - Aug 08 , 2025 | 02:59 AM
మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన మొదటి టీ20లో భారత్-ఎ 13 పరుగులతో పరాజయం చవిచూసింది. మూడు టీ20లు, మూడు వన్డేలతోపాటు ఒక అనధికార టెస్ట్...
ఆస్ట్రేలియా-ఎతో తొలి టీ 20
మకే (ఆస్ట్రేలియా) : మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన మొదటి టీ20లో భారత్-ఎ 13 పరుగులతో పరాజయం చవిచూసింది. మూడు టీ20లు, మూడు వన్డేలతోపాటు ఒక అనధికార టెస్ట్ సిరీ్‌సలో తలపడేందుకు ఆస్ట్రేలియాలో మన మహిళలు పర్యటిస్తున్నారు. గురువారం జరిగిన తొలి టీ20లో మొదట ఆస్ట్రేలియా-ఎ 20 ఓవర్లలో 137/6 స్కోరు చేసింది. అనికా (50 నాటౌట్), అలీసా హీలీ (27) రాణించారు. లెగ్ స్పిన్నర్ ప్రేమా రావత్ (3/15) మూడు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో భారత్-ఎ 20 ఓవర్లలో 124/5 స్కోరుకే పరిమితమై ఓడింది. రాఘవీ బిస్త్ (33), ఉమా ఛెత్రి (31), కెప్టెన్ రాధా యాదవ్ (26 నాటౌట్) పోరాడారు. అమీ, సియాన చెరో రెండు వికెట్లు సాధించారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 02:59 AM