అజర్ స్టాండ్ తొలగించండి
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:31 AM
ఉప్పల్ స్టేడియంలో ఉత్తర భాగం స్టాండ్స్‌కు ఉన్న మాజీ కెప్టెన్ అజరుద్దీన్ పేరును తక్షణమే తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)...
హెచ్‌సీఏకు అంబుడ్స్‌మన్ ఆదేశాలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఉప్పల్ స్టేడియంలో ఉత్తర భాగం స్టాండ్స్‌కు ఉన్న మాజీ కెప్టెన్ అజరుద్దీన్ పేరును తక్షణమే తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో అజర్ తన పేరు పెట్టుకునే క్రమంలో అవలంబించాల్సిన పద్ధతులను పాటించలేదని హెచ్‌సీఏకి అనుబంధంగా ఉన్న లార్డ్స్ క్రికెట్ క్లబ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అంబుడ్స్‌మన్ శనివారం తుది తీర్పును వెలువరించారు. అజరుద్దీన్ చర్య పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తెలిపారు. స్టాండ్స్‌కు పేరు పెట్టే విషయాన్ని హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో తీర్మానించలేదని పేర్కొన్నారు. ఇకనుంచి జరిగే మ్యాచ్ టిక్కెట్ల ముద్రణపై కూడా అజర్ పేరు ఉండకూడదని అంబుడ్స్‌మన్ ఆదేశించారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 20 , 2025 | 04:31 AM