ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Norway Chess Tournament: టైటిల్‌ రేస్‌లో గుకేష్‌

ABN, Publish Date - Jun 07 , 2025 | 05:43 AM

ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌..నార్వే చెస్‌ టోర్నీ టైటిల్‌ రేసులోకి దూసుకొచ్చాడు. తొమ్మిదో రౌండ్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ వీ యీని చిత్తు చేసి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.

  • నార్వే చెస్‌ తొమ్మిదో రౌండ్‌లో విజయం

స్టావంజర్‌ (నార్వే): ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌..నార్వే చెస్‌ టోర్నీ టైటిల్‌ రేసులోకి దూసుకొచ్చాడు. తొమ్మిదో రౌండ్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ వీ యీని చిత్తు చేసి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. దాంతో మొత్తం 14.5 పాయింట్లతో గుకేష్‌ రెండో స్థానంలో నిలిచాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి టై బ్రేకర్‌ పోరులో హికారు నకమురా చేతిలో పరాజయం పాలయ్యాడు. మొత్తం 11.5 పాయింట్లతో అర్జున్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక..తొమ్మిదో రౌండ్‌లో కరువానాపై గెలుపొందిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (15) టాప్‌లో నిలిచాడు. మహిళల విభాగంలో గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి తొమ్మిదో రౌండ్‌లో చైనా క్రీడాకారిణి లీ టింగ్‌జీ చేతిలో ఓడింది. ఇప్పటిదాకా టాప్‌లో ఉన్న హంపి (13.5) తాజా ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. ఈ రౌండ్‌లో విజయం అందుకున్న ఉక్రెయిన్‌ జీఎం అనా ముజిచుక్‌ (15.5) అగ్రస్థానంలో నిలిచింది. స్పెయిన్‌కు చెందిన సార ఖదెమ్‌ చేతిలో పరాజయం పాలైన జీఎం వైశాలీ (9.5) ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Updated Date - Jun 07 , 2025 | 05:45 AM