ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లెక్క సరిచేసిన గుకేష్‌

ABN, Publish Date - Jun 04 , 2025 | 04:34 AM

సహచరుడు అర్జున్‌ ఇరిగేసిపై బదులు తీర్చుకొన్న వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌.. నార్వే చెస్‌ టోర్నీలో ద్వితీయ స్థానానికి ఎగబాకాడు. 6వ రౌండ్‌లో కార్ల్‌సన్‌పై గెలుపుతో బలంగా పుంజుకొన్న...

  • నార్వే చెస్‌లో అర్జున్‌పై గెలుపు

స్టావెంజర్‌ (నార్వే): సహచరుడు అర్జున్‌ ఇరిగేసిపై బదులు తీర్చుకొన్న వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌.. నార్వే చెస్‌ టోర్నీలో ద్వితీయ స్థానానికి ఎగబాకాడు. 6వ రౌండ్‌లో కార్ల్‌సన్‌పై గెలుపుతో బలంగా పుంజుకొన్న గుకేష్‌.. 7వ రౌండ్‌లో అర్జున్‌పై గెలిచాడు. తెల్లపావులతో ఆడిన గుకేష్‌ 92 ఎత్తు ల్లో అర్జున్‌ ఆట కట్టించాడు. 2వ రౌండ్‌లో అర్జున్‌ చేతిలో గుకేష్‌ ఓడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో క్లాసిక్‌ గేమ్‌లో నెగ్గిన గుకేష్‌.. మొత్తం 7 రౌండ్ల నుంచి 11.5 పా యింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కరువానా 12.5 పా యింట్లతో టాప్‌లో ఉండగా.. కార్ల్‌సన్‌ 11 పాయింట్లతో మూడో స్థానంలో, అర్జున్‌ 7.5 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల ఏడో రౌండ్‌లో ముజిచెక్‌తో క్లాసిక్‌ గేమ్‌ను డ్రా చేసుకొన్న హంపి.. ఆర్మ్‌గెడాన్‌లో ఓటమి పాలైంది. కాగా, లీ టింగ్జీ చేతిలో వైశాలి క్లాసిక్‌ గేమ్‌లోనే ఓడింది. 7 రౌండ్ల నుంచి హంపి 10.5 పాయింట్లతో మూడో స్థానంలో, వైశాలి 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

ఇవీ చదవండి:

గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!

బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 04:34 AM