ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీకారం తీర్చుకున్నాడు

ABN, Publish Date - Jun 03 , 2025 | 05:26 AM

ప్రపంచ చాంపియన్‌ గుకే్‌ష..వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. నార్వే చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. తద్వారా క్లాసికల్‌ గేమ్‌లో..సమకాలీన చెస్‌ దిగ్గజం కార్ల్‌సన్‌పై గుకేష్‌ తొలిసారి గెలిచాడు...

కార్ల్‌సన్‌కు గుకేష్‌ షాక్‌

స్టావంజర్‌ (నార్వే): ప్రపంచ చాంపియన్‌ గుకే్‌ష..వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. నార్వే చెస్‌ టోర్నీ ఆరో రౌండ్‌లో కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. తద్వారా క్లాసికల్‌ గేమ్‌లో..సమకాలీన చెస్‌ దిగ్గజం కార్ల్‌సన్‌పై గుకేష్‌ తొలిసారి గెలిచాడు. ఆదివారం రాత్రి జరిగిన ఆరో గేమ్‌లో తెల్లపావులతో తలపడిన 19 ఏళ్ల గుకేష్‌ 62 సుదీర్ఘ ఎత్తుల అనంతరం కార్ల్‌సన్‌కు చెక్‌ పెట్టాడు. నల్లపావులతో ఆడినా మ్యాచ్‌లో సింహభాగం కార్ల్‌సనే ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే సరైన ఎత్తులతో ప్రత్యర్థిని ఎదుర్కొన్న గుకేష్‌ గేమ్‌ సుదీర్ఘంగా కొనసాగేలా చేశాడు. ఈక్రమంలో కార్ల్‌సన్‌ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న భారత జీఎం ప్రత్యర్థిపై సంచలన విజయం అందుకున్నాడు. టోర్నీ తొలి రౌండ్‌లో మాగ్నస్‌ చేతిలో చవిచూసిన ఓటమికి గుకేష్‌ బదులు తీర్చుకున్నాడు. ఆరో రౌండ్‌ గెలుపుతో మొత్తం 8.5 పాయింట్లతో గుకేష్‌ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అర్జున్‌ ఇరిగేసి ఆర్మ్‌గడాన్‌ టైబ్రేకర్‌లో వీ ఈ (చైనా)పై నెగ్గాడు. దాంతో మొత్తం 7.5 పాయింట్లతో నకమురాతో కలిసి అర్జున్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో వైశాలీ చేతిలో టైబ్రేకర్‌లో కోనేరు హంపి ఓటమిపాలైంది. అయితే మొత్తం 9.5 పాయింట్లతో ముజిచుక్‌తో కలిసి హంపి అగ్ర స్థానంలో ఉంది.


తప్పు చేసి..సారీ చెప్పి..

గుకేష్‌ చేతిలో ఓటమితో కార్ల్‌సన్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈక్రమంలో అతడు టేబుల్‌పై బలంగా బాదాడు. దాంతో బోర్డుపై ఉన్న పావులు చెల్లాచెదురయ్యాయి. ఆపై గుకే్‌షకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి సారీ చెప్పిన కార్ల్‌సన్‌ సీటులోంచి లేచాడు. తప్పు తెలుసుకొని తిరిగి వచ్చి టేబుల్‌పై చెల్లాచెదురైన పావులను సర్దాడు. మరోవైపు కార్ల్‌సన్‌పై విజయాన్ని జీర్ణించుకొనేందుకు గుకే్‌షకు కొంత సమయం పట్టింది. ఈక్రమంలో కార్ల్‌సన్‌ రూమ్‌ నుంచి వెళుతూ గుకే్‌షకు మరోసారి సారీ చెప్పి వెన్ను తట్టడం అందర్నీ ఆకర్షించింది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 05:26 AM