ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అసమానతలు తగ్గించాలి

ABN, Publish Date - Apr 27 , 2025 | 02:26 AM

ఐపీఎల్‌లో రాణిస్తే భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకోవడం సులువనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంటుంది. ఒక్క సీజన్‌లో అదరగొడితే చాలు అభిమానులు కూడా అందలం ఎక్కిస్తుంటారు...

ఐపీఎల్‌-దేశవాళీ క్రికెట్‌పై గవాస్కర్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో రాణిస్తే భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకోవడం సులువనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతుంటుంది. ఒక్క సీజన్‌లో అదరగొడితే చాలు అభిమానులు కూడా అందలం ఎక్కిస్తుంటారు. ఇప్పటికే ఈ లీగ్‌ ద్వారా ఎంతోమంది జాతీయ జట్టులోకి వచ్చారు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు మాత్రం పెద్దగా ఎవరి దృష్టిలోకి రావడం లేదు. ఐపీఎల్‌తో పోలిస్తే వీరికి చాన్స్‌ల పరంగానే కాకుండా జీతభత్యాల విషయంలోనూ భారీ వ్యత్యాసమే కనిపిస్తుంటుంది. ఇదే విషయాన్ని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ గుర్తుచేస్తున్నాడు. ‘అనామక క్రికెటర్‌ కూడా ఐపీఎల్‌లో రాణిస్తే గౌరవం దక్కించుకుంటాడు. అదే రంజీ ట్రోఫీలో గొప్ప ప్రదర్శన చేసే ఆటగాడు కనీసం హెడ్‌లైన్స్‌లోనూ కనిపించడు. కెరీర్‌ మొత్తం రంజీల్లో ఆడినా రాని పేరు ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లో రాణిస్తే వస్తుంది. దీనికితోడు దేశవాళీ క్రికెట్‌లో అన్ని టోర్నీల్లో ఆడినా కూడా ఐపీఎల్‌ అన్‌క్యా్‌ప్డ ప్లేయర్‌ కనీస ధర అయిన రూ.30 లక్షలు కూడా రావు. ఈ అసమానతలను తగ్గించే బాధ్యత రాష్ట్రాల క్రికెట్‌ బోర్డులతో పాటు బీసీసీఐపైనా ఉంది’ అని గవాస్కర్‌ సూచించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 02:26 AM