Pitch Inspection: గంభీర్‌కు ఆ హక్కుంది గిల్
ABN, Publish Date - Jul 31 , 2025 | 05:32 AM
ఓవల్ చీఫ్ క్యూరేటర్ ఫోర్టి్‌సతో ఘర్షణ విషయంలో కోచ్ గంభీర్‌కు గిల్ మద్దతుగా నిలిచాడు. పిచ్‌ను పరిశీలించడానికి భారత కోచ్‌కు హక్కుందన్నాడు. ఇదో అనవసర వివాదమని...
ఓవల్ చీఫ్ క్యూరేటర్ ఫోర్టి్‌సతో ఘర్షణ విషయంలో కోచ్ గంభీర్‌కు గిల్ మద్దతుగా నిలిచాడు. పిచ్‌ను పరిశీలించడానికి భారత కోచ్‌కు హక్కుందన్నాడు. ఇదో అనవసర వివాదమని అభిప్రాయపడ్డాడు. భారత సహాయ సిబ్బంది వికెట్‌ను పరిశీలించడానికి వెళ్లినప్పుడు.. దూరం నుంచే చూడాలని ఫోర్టిస్ చెప్పడంతో అతడిపై గౌతీ ఫైర్ అయ్యాడు. ‘ఇలా దూరం నుంచే చూడాలని చెప్పడం ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. వికెట్‌ను పరిశీలించడం కెప్టెన్, కోచ్ బాధ్యత’ అని గిల్ చెప్పాడు. ఇతర వేదికలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని తెలిపాడు. కాగా, ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ ఒలీ పోప్, రూట్ బుధవారం పిచ్‌పై నిలుచొని షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. దీంతో టీమిండియా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ కూడా గంభీర్‌ను సమర్థించారు.
ఇవి కూడా చదవండి..
మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 31 , 2025 | 05:33 AM