Eng Vs India: ఉత్కంఠగా చివరి టెస్ట్.. వెలుతురు లేమి కారణంగా ఆటకు బ్రేక్
ABN, Publish Date - Aug 03 , 2025 | 10:10 PM
ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది (Ind vs Eng). టీ బ్రేక్ వరకు ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగింది. అయితే సెంచరీ హీరోలు హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అవుటైన తర్వాత టీమిండియా మళ్లీ గేమ్‌లోకి వచ్చింది.
ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది (Ind vs Eng). టీ బ్రేక్ వరకు ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగింది. అయితే సెంచరీ హీరోలు హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) అవుటైన తర్వాత టీమిండియా మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. టీ బ్రేక్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి టీమిండియాను రేస్‌లోకి తీసుకొచ్చాడు. ప్రసిద్ధ్, సిరాజ్ అద్భుతమైన బంతులతో ఉత్కంఠ కలిగిస్తున్నారు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమైన దశలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.
ఇంగ్లండ్ ఎదుట టీమిండియా 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ భారీ లక్ష్యానికి ఇంగ్లండ్ సునాయాసంగా ఛేదించింది. చివరి రోజు ఆరంభంలో రెండు వికెట్లు పడగొట్టి సంతోషంలో మునిగిన టీమిండియాకు బ్రూక్, రూట్ షాకిచ్చారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 195 పరుగులు జోడించారు. టీమిండియా బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్, రూట్ వేగంగా పరుగులు చేశారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 98 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. అందులో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
జో రూట్ అవుట్ అయిన తర్వాత టీమిండియా మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. సిరాజ్, ప్రసిద్ధ్ వేస్తున్న బంతులు ప్యాడ్లను తాకుతూ బ్యాటర్లను ఇబ్బందిపెడుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 03 , 2025 | 10:10 PM