ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wimbledon: జొకో జోరు

ABN, Publish Date - Jul 04 , 2025 | 03:25 AM

సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో 19వసారి మూడో రౌండ్‌కు చేరిన ఘనత అందుకున్నాడు. ఇక..మరో సీడెడ్‌...

19వ సారి మూడోరౌండ్‌కు

వింబుల్డన్‌ నుంచి జాస్మిన్‌ అవుట్‌

లండన్‌: సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో 19వసారి మూడో రౌండ్‌కు చేరిన ఘనత అందుకున్నాడు. ఇక..మరో సీడెడ్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి నాలుగో సీడ్‌ జాస్మిన్‌ పోలిని వంతైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఆరో సీడ్‌ జొకో 6-3, 6-2, 6-0తో ఇవాన్స్‌ను చిత్తు చేశాడు. వింబుల్డన్‌లో నొవాక్‌కిది మొత్తంగా 99వ మ్యాచ్‌కాగా..ఫెడరర్‌ (18)ను అధిగమించి 19వసారి జొకో ఇక్కడ మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో అన్‌సీడెడ్‌ రఖిమోవా 4-6, 6-4, 6-4తో నిరుటి రన్నరప్‌ జాస్మిన్‌కు షాకిచ్చింది. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 8వ సీడ్‌ స్వియటెక్‌ 5-7, 6-2, 6-1తో మెక్‌నాలీపై, డిఫెండింగ్‌ చాంప్‌ క్రెజికోవా 6-4, 3-6, 6-2తో డొలిడేపై, లోకల్‌ స్టార్‌ రదుకాను 6-3, 6-3తో 2023 వింబుల్డన్‌ విజేత ఒండ్రుసోవాపై, 7వ సీడ్‌ ఆండ్రీవా 6-1, 7-6 (4)తో బ్రోంజెటీపై, 10వ సీడ్‌ నవారో 6-1, 6-2తో కుడెర్మెటోవాపై, 11వ సీడ్‌ రిబకినా 6-3, 6-1తో సకారిపై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో 11వ సీడ్‌ డిమినార్‌, 19వ సీడ్‌ డిమిత్రోవ్‌ మూడో రౌండ్‌కు చేరారు.

రెండో రౌండ్‌లో బాలాజీ జోడీ: భారత ఆటగాడు శ్రీరామ్‌ బాలాజీ/మిగ్వెల్‌ రేయస్‌ (మెక్సికో) ద్వయం 6-4, 6-4తో అమెరికా జంట టీన్‌/అలెక్సాండర్‌పై నెగ్గి డబుల్స్‌ రెండో రౌండ్‌కు చేరింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 04 , 2025 | 03:25 AM