ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధోనీ కోసం.. ప్రత్యేక అతిథులు

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:41 AM

చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌ ఓ అరుదైన దృశ్యానికి వేదికైంది. ప్రత్యేక అతిథులతో సందడిగా మారింది. ధోనీ తల్లిదండ్రులు పాన్‌ సింగ్‌, దేవకీ దేవి ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు....

చెన్నై: చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌ ఓ అరుదైన దృశ్యానికి వేదికైంది. ప్రత్యేక అతిథులతో సందడిగా మారింది. ధోనీ తల్లిదండ్రులు పాన్‌ సింగ్‌, దేవకీ దేవి ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆడుతున్నా..తమ కుమారుడి మ్యాచ్‌ను వీక్షించేందుకు పాన్‌ సింగ్‌, దేవకీ దేవీ స్టేడియానికి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ధోనీ భార్య సాక్షి, కూతురు జీవా కూడా మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే ఎన్నడూ మ్యాచ్‌లకు రాని ధోనీ తల్లిదండ్రులు.. ఈసారి స్టేడియంలో దర్శనమివ్వడంతో మహీకిదే చివరి ఐపీఎల్‌ అన్న వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆఖరిసారి తమ కుమారుడి వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌ నైపుణ్యాలను కళ్లారా వీక్షించేందుకే ధోనీ తల్లిదండ్రులు వచ్చారంటూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 04:41 AM