ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Premier League: ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో కోహ్లీ అన్న కొడుకు,సెహ్వాగ్‌ కుమారులు

ABN, Publish Date - Jul 01 , 2025 | 03:03 AM

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో ఇద్దరు ప్రముఖ క్రికెటర్ల బంధువులు బరిలో నిలిచారు. వారిలో ఒకరు విరాట్‌ కోహ్లీ అన్న కుమారుడు ఆర్యవీర్‌ కోహ్లీ (15)కాగా, మరొకరు టీమిండియా మాజీ ఓపెనర్‌...

న్యూఢిలీ: ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో ఇద్దరు ప్రముఖ క్రికెటర్ల బంధువులు బరిలో నిలిచారు. వారిలో ఒకరు విరాట్‌ కోహ్లీ అన్న కుమారుడు ఆర్యవీర్‌ కోహ్లీ (15)కాగా, మరొకరు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనయులు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (17), వేదాంత్‌ సెహ్వాగ్‌ (15). విరాట్‌ అన్న వికాస్‌ కోహ్లీ తనయుడే ఆర్యవీర్‌ కోహ్లీ. లెగ్‌స్పిన్నర్‌ అయిన ఆర్యవీర్‌..విరాట్‌ కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ వద్ద శిక్షణ పొందుతున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ అండర్‌-16 జట్టులో పేరు నమోదు చేసుకున్న ఆర్యవీర్‌ డీపీఎల్‌ వేలంలో గ్రేడ్‌-సి విభాగంలో పోటీపడుతున్నాడు. ఇక..ఢిల్లీ అండర్‌-19 జట్టుకు ఆడుతున్న ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ వేలంలో గ్రూప్‌-బిలో బరిలోకి దిగుతున్నాడు. అలాగే ఢిల్లీ అండర్‌-16కి ఆడుతున్న ఆఫ్‌ స్పిన్నర్‌ వేదాంత్‌ సెహ్వాగ్‌ కూడా గ్రూప్‌-బిలో పోటీపడుతున్నాడు. జూలై ఐదున వేలం జరగనుంది. గత ఏడాది డీపీఎల్‌ తొలి సీజన్‌ జరిగింది.

Updated Date - Jul 01 , 2025 | 03:06 AM