Deepti Sharma: దీప్తి 2 ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్
ABN, Publish Date - Aug 13 , 2025 | 02:08 AM
టీమిండియా స్టార్ దీప్తి శర్మ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలర్‌గా అగ్రస్థానానికి చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి ఓ స్థానం...
దుబాయ్: టీమిండియా స్టార్ దీప్తి శర్మ ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో బౌలర్‌గా అగ్రస్థానానికి చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి ఓ స్థానం మెరుగుపరచుకొని 732 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. ఇక, ఆస్ట్రేలియాకు చెందిన అనబెల్ సదర్లాండ్ (736) నెంబర్‌వన్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్లలో దీప్తి శర్మ మూడో ర్యాంక్‌లో నిలిచింది. హేలీ మాథ్యూస్ టాప్ ఆల్‌రౌండర్‌గా ఉంది. బ్యాటర్ల జాబితాలో స్మృతీ మంధాన నెంబర్‌వన్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయింది. నాట్ సివర్ బ్రంట్ (ఇంగ్లండ్) టాప్ బ్యాటర్‌గా చోటు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 13 , 2025 | 02:08 AM