ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నల్లకలువదే ఎర్రకోట

ABN, Publish Date - Jun 08 , 2025 | 04:42 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా కొకో గాఫ్‌ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్‌.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్‌ నెంబర్‌ 1 ఎరీనా సబలెంక (బెలారస్‌)ను ఓడించి ఎర్రకోటలో...

ప్రైజ్‌మనీ

కొకొ గాఫ్‌కు రూ.24.87 కోట్లు

సబలెంకకు రూ.12.43 కోట్లు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత కొకొ గాఫ్‌

ఫైనల్లో సబలెంకకు నిరాశ

ఇద్దరూ ఇద్దరే.. ఒకరు వరల్డ్‌ నెంబర్‌ వన్‌ సబలెంక, మరొకరు వరల్డ్‌ నెంబర్‌ టూ కొకొ గాఫ్‌. బరిలోకి దిగిన పదిసార్లు కూడా సమాన విజయాలే. గ్రాండ్‌స్లామ్స్‌లోనే కాదు.. క్లే కోర్టుల్లోనూ తలపడిన రెండేసిసార్లూ పైచేయి. అలాంటి వీళ్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? అంచనాలకు తగ్గట్టుగానే ఇద్దరూ నువ్వా.. నేనా? అనే రీతిలో ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే ఆఖరి పోరాటంలో చివరకు నల్ల కలువ గాఫ్‌కే ఫ్రెంచ్‌ కిరీటం దక్కింది. గెలుపు అవకాశాలను చేజార్చుకున్న సబలెంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా కొకో గాఫ్‌ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్‌.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్‌ నెంబర్‌ 1 ఎరీనా సబలెంక (బెలారస్‌)ను ఓడించి ఎర్రకోటలో పాగా వేసింది. గాఫ్‌ కెరీర్‌లో ఇదే తొలి ఫ్రెంచ్‌ ఓపెన్‌ కాగా.. ఆమెకిది రెండో గ్రాండ్‌స్లామ్‌. 2023లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచింది. అలాగే 2015లో సెరెనా తర్వాత మరో యూఎస్‌ క్రీడాకారిణి ఇక్కడ నెగ్గడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా సెరెనా (2002లో) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ను గెలిచిన యంగెస్ట్‌ అమెరికన్‌గానూ గాఫ్‌ నిలిచింది. ఇక సబలెంక కెరీర్‌లో ఆస్ట్రేలియన్‌, యూఎస్‌ ఓపెన్‌ గెలిచినా ఇప్పటిదాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గలేకపోయింది. ఈ పోరులో సబలెంక 70 అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. గాఫ్‌ 9 బ్రేక్‌ పాయింట్లు, 3 ఏస్‌లతో చెలరేగింది.


హోరాహోరీగా..: తొలి సెట్‌లో సబలెంక శక్తివంతమైన బేస్‌లైన్‌ ఆటతీరుతో పాటు గాఫ్‌ పదునైన సర్వీస్‌ రిటర్న్‌లతో పోరు రంజుగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలు, డ్యూస్‌ల కారణంగా ఈ సెట్‌ గంటా 18 నిమిషాలు సాగింది. తొలి పాయింట్‌ గాఫ్‌దే అయినా సబలెంక ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్‌ చేస్తూ ఓ దశలో 4-1తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కానీ తర్వాత పుంజుకున్న గాఫ్‌ వరు సగా 3 పాయింట్లతో స్కోరును సమం చేసింది. ఇక్కడి నుంచి కోర్టులో చిరుతల్లా ఇద్దరూ తలపడ్డారు. ఫలితంగా సెట్‌ 6-6తో టైబ్రేక్‌కు వెళ్లింది. ఇందులో సబలెంక ఆరంభంలో వెనుకబడినా పట్టు వదలకుండా ఆడి సెట్‌ను 7-6తో ముగించింది. అయితే కీలక రెండో సెట్‌లో చెలరేగిన గాఫ్‌ 35 నిమిషాల్లోనే 6-2తో గెలిచి పోటీలో నిలిచింది. ఇక నిర్ణాయక సెట్‌ తిరిగి రసవత్తరం గా మారింది.


మొదట గాఫ్‌ బ్రేక్‌ పాయింట్లతో 3-1తో హవా చూపింది. ఈ దశలో సబలెంక ఒత్తిడిని అధిగమిస్తూ గాఫ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ 3-3తో సవాల్‌ విసిరింది. కానీ సబలెంక అనవసర తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ గాఫ్‌ రెండు వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే తొమ్మిదో గేమ్‌ను సబలెంక దక్కించుకున్నా.. 5-4 ఆధిక్యంతో గాఫ్‌ చాంపియన్‌షిప్‌ సర్వీస్‌కు దిగింది. ఇందులో సబలెంక పోరాడినా తన బ్యాక్‌ హ్యాండ్‌ విన్నర్‌ను బయటకు కొట్టడంతో.. గాఫ్‌ విజేతగా నిలిచింది.


ఇవీ చదవండి:

ఆర్సీబీపై బీసీసీఐ సీరియస్!

ఇంగ్లండ్‌కు రాహుల్ వార్నింగ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 04:42 AM