ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆఖరాటలో అదరగొట్టినా అట్టడుగునే

ABN, Publish Date - May 26 , 2025 | 05:10 AM

ఐపీఎల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 83 పరుగులతో టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చిత్తు చేసింది. అన్ని లీగ్‌ మ్యాచ్‌లను...

గుజరాత్‌పై చెన్నై భారీ గెలుపు

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 83 పరుగులతో టేబుల్‌ టాపర్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చిత్తు చేసింది. అన్ని లీగ్‌ మ్యాచ్‌లను పూర్తి చేసిన ఐదుసార్లు చాంపియన్‌ చెన్నై కేవలం 8 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కాగా ఈ సీజన్‌లో నాకౌట్‌కు చేరడంలో విఫలమైన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరిన టీమ్‌ను ఓడించడం వరుసగా ఇది నాలుగోసారి.

ఇక..డెవాల్డ్‌ బ్రేవిస్‌ (23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57) మెరుపులకు కాన్వే (35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52), ఆయుష్‌ మాత్రే (17 బంతు ల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్‌ పటేల్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) ధనాధన్‌ బ్యా టింగ్‌ తోడవడంతో తొలుత చెన్నై 20 ఓవర్లలో 230/5 స్కోరు చేసింది. ఈ ఐపీఎల్‌లో చెన్నైకిదే అత్యధిక స్కోరు. భారీ ఛేదనలో గుజరాత్‌ 18.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్‌ (41), అర్షద్‌ ఖాన్‌ (20) మాత్రమే ఓ మోస్తరుగా ఆడారు. అన్షుల్‌ కాంబోజ్‌ (3/13), స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (3/21) చెరో 3 వికెట్లు పడగొట్టారు. బ్రేవిస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.


పవర్‌ ప్లేలోనే తేలిపోయింది: ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ గిల్‌ (13), బట్లర్‌ (5), హార్డ్‌ హిట్టర్‌ రూథర్‌ఫోర్డ్‌ (0) విఫలమవడంతో పవర్‌ ప్లేలో 35/3తో గుజరాత్‌ ఓటమి అంచున నిలిచింది. సుదర్శన్‌, షారుఖ్‌ (19) నాలుగో వికెట్‌కు 55 రన్స్‌ జోడిం చినా.. వారిద్దరినీ జడేజా 4 బంతుల తేడాతో పెవిలియన్‌ చేర్చడంతో గుజరాత్‌ కోలుకోలేకపోయింది.

బ్యాటర్లు ‘సూపర్‌’: ఆఖరి మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఆడేసుకున్నారు. బ్రేవిస్‌, ఆయుష్‌ మాత్రే, ఉర్విల్‌ పటేల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు. మాత్రే, కాన్వే జోరుకు 3.4 ఓవర్లలోనే 44 పరుగులు చేసిన చెన్నై తిరుగులేని స్థితికి చేరింది. అర్షద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో మాత్రే 2, 6, 6, 6, 4, 4తో 28 పరుగులు కొల్లగొట్టాడు. ఇదే ఓవర్లో మాత్రే నిష్క్రమించినా..కాన్వే, ఉర్విల్‌ ఏమాత్రం తగ్గకుండా రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. 10వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఉర్విల్‌ కొట్టిన సిక్సర్‌ మ్యాచ్‌కే హైలైట్‌. ఆ వెంటనే ఉర్విల్‌ అవుటైనా కాన్వే ఎదురు దాడి కొనసాగించి హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. కాన్వేను రషీద్‌ బౌల్డ్‌ చేయగా అనంతరం గుజరాత్‌ బౌలర్లకు చుక్కలు చూపిన బ్రేవిస్‌ ఐదో వికెట్‌కు జడేజా (21)తో కలిసి 39 బంతుల్లోనే 74 పరుగులు జత చేశాడు. ఈ క్రమంలో బ్రేవిస్‌ 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు.


స్కోరుబోర్డు

చెన్నై: ఆయుష్‌ మాత్రే (సి) సిరాజ్‌ (బి) ప్రసిద్ధ్‌ 34, కాన్వే (బి) రషీద్‌ 52, ఉర్విల్‌ పటేల్‌ (సి) గిల్‌ (బి) సాయికిషోర్‌ 37, శివమ్‌ దూబే (సి) కొట్జీ (బి) షారుఖ్‌ 17, బ్రేవిస్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిద్ధ్‌ 57, జడేజా (నాటౌట్‌) 21, ఎక్స్‌ట్రాలు : 12 ; మొత్తం 20 ఓవర్లలో 230/5 ; వికెట్ల పతనం : 1-44, 2-107, 3-144, 4-156, 5-230 ; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-47-0, అర్షద్‌ ఖాన్‌ 2-0-42-0, ప్రసిద్ధ్‌ 4-0-22-2, కొట్జీ 3-0-34-0, సాయి కిషోర్‌ 2-0-23-1, రషీద్‌ ఖాన్‌ 4-0-42-1, షారుఖ్‌ ఖాన్‌ 1-0-13-1

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) శివమ్‌ దూబే (బి) జడేజా 41, గిల్‌ (సి) ఉర్విల్‌ (బి) అన్షుల్‌ కాంబోజ్‌ 13, బట్లర్‌ (సి) అన్షుల్‌ (బి) ఖలీల్‌ 5, రూథర్‌ఫోర్డ్‌ (సి) మాత్రే (బి) అన్షుల్‌ 0, షారుఖ్‌ ఖాన్‌ (సి) పథిరన (బి) జడేజా 19, తెవాటియా (సి) శివమ్‌ దూబే (బి) నూర్‌ అహ్మద్‌ 14, రషీద్‌ (సి) ఉర్విల్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 12, కొట్జీ (బి) పథిరన 5, అర్షద్‌ ఖాన్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 20, సాయి కిషోర్‌ (సి) ధోనీ (బి) అన్షుల్‌ 3, సిరాజ్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు : 12 ; మొత్తం 18.3 ఓవర్లలో 147 ఆలౌట్‌ ; వికెట్ల పతనం : 1-24, 2-29, 3-30, 4-85, 5-86, 6-105, 7-110, 8-126, 9-142 ; బౌలింగ్‌: జడేజా 3-0-17-2, ఖలీల్‌ అహ్మద్‌ 3-0-17-1, అన్షుల్‌ కాంబోజ్‌ 2.3-0-13-3, శివమ్‌ దూబే 2-0-33-0, నూర్‌ అహ్మద్‌ 4-0-21-3, పథిరన 3-0-29-1, దీపక్‌ హుడా 1-0-15-0.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:10 AM