ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చాంపియన్స్‌ ట్రోఫీతో రూ.737 కోట్ల నష్టం

ABN, Publish Date - Mar 18 , 2025 | 04:21 AM

అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్‌ ట్రోఫీ భారీ నష్టాలను మిగిల్చింది. 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం రావడంతో పాక్‌ బోర్డు...

పీసీబీ కుదేలు

లాహోర్‌: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్‌ ట్రోఫీ భారీ నష్టాలను మిగిల్చింది. 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం రావడంతో పాక్‌ బోర్డు లాహోర్‌, కరాచీ, రావల్పిండి స్టేడియాలను ఆధునీకరించేందుకు రూ.503 కోట్లు (భారత కరెన్సీలో) ఖర్చు చేసింది. ఇది వారు అంచనా వేసిన బడ్జెట్‌కన్నా 50 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే ఈవెంట్‌ నిర్వహణ కోసం మరో రూ.347 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంతా చేస్తే ఐసీసీ నుంచి ఆతిథ్య ఫీజు, టిక్కెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్స్‌ ద్వారా పీసీబీకి వచ్చింది రూ.52 కోట్లు మాత్రమే. పేరుకే ఆతిథ్య దేశం..కానీ పాక్‌ జట్టు స్వదేశంలో ఆడింది ఒక్క మ్యాచ్‌ మాత్రమే. న్యూజిలాండ్‌తో ఆడిన ఆ మ్యాచ్‌లో ఓడింది. భారత్‌తో మ్యాచ్‌ని దుబాయ్‌లో ఆడింది. బంగ్లాతో స్వదేశంలో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. దీంతో మొత్తంగా పాక్‌ బోర్డు ఈ టోర్నీ నిర్వహణ ద్వారా రూ.737 కోట్ల నష్టాలను చవిచూసింది. ఈ భారీ మొత్తాన్ని పూడ్చుకునేందుకు ఇప్పుడు పీసీబీ పొదుపు చర్యలకు దిగింది.


జాతీయ టీ20 చాంపియన్‌షి్‌ప ఆడే ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజును ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రూ.40 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించినట్టు పాక్‌ మీడియా పేర్కొంది. అంతేకాదు.. స్టార్‌ హోటళ్లలో కాకుండా ఎకానమీ హోటళ్లలో సర్దుకుపోవాలని ఆటగాళ్లకు చెపినట్టు సమాచారం. అయితే పీసీబీ చైర్మన్‌ నఖ్వీ సూచనల మేరకు మ్యాచ్‌ ఫీజును రూ.30 వేలుగా ఖరారు చేయవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

Read Also : Sourav Ganguly in Khakee: ఖాకీ సిరీస్‌‌లో గంగూలీ.. టీజర్‌లో షాకిచ్చిన బెంగాల్ టైగర్.. అసలు కథేంటంటే..

ఇండియాదే ‘మాస్టర్స్‌’

ఫ్యామిలీ ఉండాల్సిందే!

Updated Date - Mar 18 , 2025 | 04:21 AM