Dhoni: ట్రేడ్‌మార్క్‌గా కెప్టెన్ కూల్
ABN, Publish Date - Jul 01 , 2025 | 03:39 AM
కెప్టెన్ కూల్ అం టే క్రికెట్ అభిమానులకు వెంటనే స్ఫురించే పేరు ధోనీ. మైదానంలో ఎంతో ఒత్తిడి ఉన్నా.. ప్రశాంతంగా తనదైన వ్యూహాలను అమలు చేయడం ధోనీ స్టైల్. ఇప్పుడు ఆ కెప్టెన్...
రిజిస్టర్ చేసిన ధోనీ
న్యూఢిల్లీ: ‘కెప్టెన్ కూల్’ అం టే క్రికెట్ అభిమానులకు వెంటనే స్ఫురించే పేరు ధోనీ. మైదానంలో ఎంతో ఒత్తిడి ఉన్నా.. ప్రశాంతంగా తనదైన వ్యూహాలను అమలు చేయడం ధోనీ స్టైల్. ఇప్పుడు ఆ ‘కెప్టెన్ కూల్’నే మహీ ట్రేడ్ మార్క్‌గా మార్చాడు. క్రీడలకు సంబంధించి ట్రైనింగ్, ఇతరత్రా సౌకర్యాల కింద ‘కెప్టెన్ కూల్’ పేరును రిజిస్టర్ చేశాడు. ఈ నెల 5న ఇందు కోసం దరఖాస్తు చేసుకోగా.. వెంటనే ఆమోదించారు. ఈ నెల 16న ట్రేడ్ మార్క్ జర్నల్‌లో పబ్లిష్ కావడం విశేషం. అయితే, ప్రభా స్కిల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంతకంటే ముందే ‘కెప్టెన్ కూల్’ టైటిల్ కోసం దరఖాస్తు చేసినా.. మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం.
Updated Date - Jul 01 , 2025 | 03:41 AM