బట్లర్ సెంచరీ మిస్
ABN, Publish Date - Jun 08 , 2025 | 04:28 AM
కీపర్ బట్లర్ (59 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96) బ్యాటింగ్‌లో, స్పిన్నర్ లియామ్ డాసన్ (4/20) బౌలింగ్‌లో అదరగొట్టడంతో వెస్టిండీ్‌సతో తొలి టీ20లో..
తొలి టీ20లో విండీస్ పై ఇంగ్లండ్ గెలుపు
చెస్టర్ లీ స్ట్రీట్: కీపర్ బట్లర్ (59 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96) బ్యాటింగ్‌లో, స్పిన్నర్ లియామ్ డాసన్ (4/20) బౌలింగ్‌లో అదరగొట్టడంతో వెస్టిండీ్‌సతో తొలి టీ20లో ఇంగ్లండ్ 21 పరుగులతో నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 188/6 స్కోరు చేసింది. జెమీ స్మిత్ (38), బెథెల్ (23 నాటౌట్) సత్తా చాటారు. రొమారియో షెఫర్డ్ (2/33) రెండు వికెట్లు తీశాడు. ఛేదనలో విండీస్ 20 ఓవర్లలో 167/9 స్కోరుకే పరిమితమై ఓడింది. ఎవిన్ లూయిస్ (39), చేజ్ (24) మాత్రమే రాణించారు. పాట్స్, బెథెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 08 , 2025 | 04:29 AM