ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బుమ్రా ఆడేది 3 టెస్టులే

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:40 AM

ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు టెస్ట్‌ల్లోనే బరిలోకి దిగుతాడని టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వెల్లడించాడు. కొత్త సారథి శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి...

టీమిండియా కోచ్‌ గంభీర్‌

ముంబై : ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు టెస్ట్‌ల్లోనే బరిలోకి దిగుతాడని టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వెల్లడించాడు. కొత్త సారథి శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి గంభీర్‌ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ‘ఐదు టెస్ట్‌ల్లో ఏ మూడు మ్యాచ్‌ల్లో బుమ్రా ఆడతాడో మేం ఇంకా నిర్ణయించలేదు. సిరీ్‌సలో వచ్చే ఫలితాలను బట్టి బుమ్రాతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటాం. అయితే తాను అన్ని టెస్ట్‌లూ ఆడబోవడంలేదని బుమ్రాకు కూడా తెలిసి ఉండొచ్చు’ అని గంభీర్‌ తెలిపాడు. ‘బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టం. అయితే జట్టులో నాణ్యమైన పేసర్లున్నారు. తమకు వచ్చిన అవకాశాలను యువ బౌలర్లు అందిపుచ్చుకోవాలి’ అని గంభీర్‌ అన్నాడు.

ఇవీ చదవండి:

బెంగళూరు విషాదంపై సచిన్ రియాక్షన్

మాల్యా గాలి తీసిన ఎస్‌బీఐ!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 04:40 AM