8 నెలల్లో కెరీర్ ముగుస్తుందన్నారు
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:53 AM
స్టార్ పేసర్ బుమ్రా తాజాగా ఇంగ్లండ్‌పై తొలి టెస్టులో ఐదు వికెట్లతో రాణించాడు. అయితే తను ఎక్కువగా గాయాలకు గురవుతుండడం తెలిసిందే. అయినా 2016లో అరంగేట్రం చేసిన ఈ స్టార్...
లీడ్స్: స్టార్ పేసర్ బుమ్రా తాజాగా ఇంగ్లండ్‌పై తొలి టెస్టులో ఐదు వికెట్లతో రాణించాడు. అయితే తను ఎక్కువగా గాయాలకు గురవుతుండడం తెలిసిందే. అయినా 2016లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ పేసర్ దాదాపు దశాబ్దకాలంగా జట్టు బౌలింగ్‌కు వెన్నెముకగా నిలుస్తుండడం విశేషం. గాయా ల సమయంలో వచ్చే విమర్శలకు బాధపడతారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మరికొందరైతే నా కెరీర్ 8 నుంచి 10 నెలలకు మించి ఉండదన్నారు. కానీ పదేళ్లుగా ఆడుతూనే ఉన్నా. ఐపీఎల్‌లో అయితే 12 ఏళ్లయ్యింది. వారిని అలాగే మాట్లాడనివ్వండి. నా వెనుక మాట్లాడే వారిని అదుపు చేయలేను. నేను మాత్రం శక్తి ఉన్నంతవరకు ఆడుతూనే ఉంటాను. ఉత్తమ ప్రదర్శన ఇస్తూ మిగతాది దేవుడికే వదిలేస్తాను’ అని బుమ్రా తెలిపాడు.
ఇవీ చదవండి:
దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 24 , 2025 | 04:53 AM