Dewald Brevis: బ్రేవిస్ మెరుపు శతకం
ABN, Publish Date - Aug 13 , 2025 | 01:55 AM
టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో యువ బ్యాటర్ డివాల్డ్ బ్రేవిస్ (56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు..
రెండో టీ20లో ఆసీ్‌సపై దక్షిణాఫ్రికా గెలుపు
డార్విన్ (ఆస్ర్టేలియా): టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన రెండో టీ20లో యువ బ్యాటర్ డివాల్డ్ బ్రేవిస్ (56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆసీ్‌సపై 53 పరుగులతో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. అలాగే ఆరు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలవగా, ఆసీ్‌సకు తొమ్మిది వరుస టీ20 విజయాల తర్వాత ఇదే తొలి ఓటమి. అటు సఫారీలు కూడా ఆరు మ్యాచ్‌ల తర్వాత ఆసీ్‌సపై నెగ్గారు. ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 218/7 స్కోరు సాధించింది. 41 బంతుల్లోనే శతకం బాదిన బ్రేవిస్ తమ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేగాక టీ20ల్లో సఫారీల తరపున పలు రికార్డులను నెలకొల్పాడు. ఛేదనలో ఆసీస్ 17.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. టిమ్ డేవిడ్ (50) మాత్రమే రాణించాడు. బాష్, మఫాకలకు మూడేసి వికెట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 13 , 2025 | 01:55 AM