బోయిసన్.296 ర్యాంక్‌లు జంప్
ABN, Publish Date - Jun 10 , 2025 | 05:08 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరి సంచలనం సృష్టించిన యువ క్రీడాకారిణి లూయిస్ బోయిసన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 296 స్థానాలు ఎగబాకింది. రొలాండ్ గారోస్ నాలుగో రౌండ్‌లో...
65కు చేరిక
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరి సంచలనం సృష్టించిన యువ క్రీడాకారిణి లూయిస్ బోయిసన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 296 స్థానాలు ఎగబాకింది. రొలాండ్ గారోస్ నాలుగో రౌండ్‌లో మూడో సీడ్ పెగులాకు షాకిచ్చిన 22 ఏళ్ల ఫ్రాన్స్ క్రీడాకారిణి బోయిసన్ ఈ టోర్నీకి ముందు 361వ ర్యాంక్‌లో ఉంది. కానీ ఫ్రెంచ్ ఓపెన్ ప్రదర్శన దరిమిలా ఆమె ఏకంగా 65వ స్థానానికి చేరింది. టాప్ ర్యాంక్‌ల్లో మార్పులు లేవు. సబలెంకా, గాఫ్, పెగులా తొలి మూడు స్థానాలలోనే నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడినా..సినర్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ విజేత అల్కారజ్ 2వ, జ్వెరెవ్ 3వ స్థానంలోనే కొనసాగుతున్నారు.
ఇవీ చదవండి:
ఆర్సీబీపై వేలాడుతున్న నిషేధం కత్తి
లేడీ అంపైర్‌పై అశ్విన్ సీరియస్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 10 , 2025 | 05:08 AM