ఏ ప్లస్ లోనే రోహిత్ విరాట్
ABN, Publish Date - May 15 , 2025 | 05:12 AM
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే వీరిద్దరూ వన్డేలలో కొనసాగనున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన వీరిద్దరు..గత జూన్‌లో టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం విదితమే...
బీసీసీఐ కార్యదర్శి సైకియా
న్యూఢిల్లీ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే వీరిద్దరూ వన్డేలలో కొనసాగనున్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన వీరిద్దరు..గత జూన్‌లో టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం విదితమే. ఈనేపథ్యంలో రోహిత్, విరాట్ బీసీసీఐ వార్షిక కేంద్ర కాంట్రాక్టులలో ఎ+కేటగిరీలోనే కొనసాగిస్తారా..లేదా..అనే చర్చ మొదలైంది. గత నెలలో ప్రకటించిన 2024-25 కాంట్రాక్టుల జాబితాలో రోహిత్, కోహ్లీలను ఎ+గ్రేడ్‌లో బీసీసీఐ కొనసాగించింది. వారితోపాటు పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్ జడేజా ఆ జాబితాలో ఉన్నారు. ఈ విభాగం క్రికెటర్లకు వార్షిక వేతనం రూ. ఏడు కోట్లు లభిస్తుంది. టెస్ట్‌ల నుంచి తప్పుకోవడంతో రోహిత్, విరాట్‌లను ఆ కేటగిరీలో కొనసాగిస్తారా..అన్న ప్రశ్నలు ఉదయించాయి. కానీ వీరిద్దరూ ఎ+విభాగంలోనే కొనసాగుతారని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బుధవారం స్పష్టంజేశాడు. ‘టెస్ట్‌లు, టీ20లనుంచి వైదొలగినా రోహిత్, కోహ్లీ ఎ+కేటగిరీలోనే కొనసాగుతారు. భారత జట్టులో వారిద్దరు ఇప్పటికే భాగమే. ఎ+ఆటగాళ్లకు లభించే అన్ని సౌకర్యాలు వారికి వర్తిస్తాయి’ అని వివరించాడు.
ఇవీ చదవండి:
కోహ్లీ రిటైర్‌మెంట్.. అనుష్క ఎమోషనల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 15 , 2025 | 05:12 AM